11 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రేణిగుంట-తిరుచ్చి విమానాశ్రయాల జోడీతో తొలి అడుగు
రూ.8.622 కోట్ల ప్రైవేటు పెట్టుబడులకు అంచనా
తిరుపతి బ్యూరో, : దేశంలోని 11 విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయాన్ని తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంతో కలిపి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈఓఐ) జారీ చేసింది. విమానాశ్రయాల ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం తొలిసారిగా జోడీ విధానాన్ని అమలు చేస్తోంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన విమానాశ్రయంతో తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని జతచేయడం ద్వారా రెండింటి నిర్వహణలో సమతుల్యత సాధించాలన్నది ఈ విధానం ఉద్దేశం. ఈ విధానంలో విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలు చేవడతాయి. ఈ 11 విమానాశ్రయాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థల నుంచి సుమారు రూ.8,622 కోట్ల పెట్టుబడులు పచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విమానాశ్రయాల్లో మౌలిక వనతుల అభివృద్ధితో పాటు వాణిజ్య కార్యకలాపాలను విస్తరించడం, దుకాణాలు, రవాణా, నరకు రవాణా తదితర మార్గాల ద్వారా వచ్చే ఇతర ఆదాయాన్ని పెంచడం ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం తదితర ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మరింత పెరిగిన తర్వాత రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలను కూడా ఇదే తరహాలో ప్రైవేటు నిర్వహణకు అప్పగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటీకరణలో భాగంగా విమానాశ్రయాల యాజమాన్యం మాత్రం ఏఏఐ వద్దనే కొనసాగుతుంది. నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. లీజు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, తొలినాళ్లలో ఏఏఐ సిబ్బందిలో 60 శాతం మందిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాల్సి ఉ టుంది. దీంతో ప్రైవేటు నిర్వహణలోకి వెళ్లిన తర్వాత కూడా అనుభవజ్ఞులైన ఏఏఐ సిబ్బంది సేవలు. కొంతకాలం అందుబాటులో ఉండనున్నాయి. 11 విమానాశ్రయాలకు సంబంధించి ఈఓఐ ప్రక్రియ అసంతరం ప్రస్తుతం బిడ్డింగ్ దశకు ప్రక్రియ చేరుకుంది. ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.