రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళ వారం రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యా లయం తొలి స్నాతకోత్స వానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. మంగళవారం ఉ దయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటా రు. ఎయిర్‌పోర్టులో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డుమా ర్గాన నగరంలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం అదే హోటల్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్స వంలో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 4.30 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతారు. బుధ వారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంమండలం జంతు లూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్స వంలో ద్రౌవది ముర్ము పాల్గొంటారు. ఒకవేళ మంగళవారం సాయంత్రం వాతావరణం అనుకూలించకపోతే రాత్రికి ఐఎన్ఎస్ చోశాలో రాష్ట్రవతి బన కోసం ఏర్పాట్లుచేశారు.