ఘన స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నేడు ఐఎన్ఎస్ సుమేధలో ఫ్లీట్ రివ్యూ
నేడు పీఎస్ఆర్ పాల్గొననున్న సీఎం చంద్రబాబు, గవర్నర్, మంత్రులు
రేపు విశాఖ ఆర్కేబీచ్ వేదికగా సిటీ పరేడ్
విశాఖసిటీ : భారత నౌకదళం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మాకమైన ఇంటర్ నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎస్ఆర్) కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. విశాఖ తూర్పు నౌక "దళం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమానికి 61 దేశాలకు చెందిన నేవీ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరైయ్యారు. త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సైతం ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. మంగళవారం సాయంత్రం ఈఎన్సీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెసిడెన్షియల్ బాంక్విట్లో ఆత్మీయ విందు కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు వివిధ దేశాల నౌకాదళాధిపతులు, సీనియర్ అధికారులు, రాజకీయ ప్రతినిధుల, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ విందుతో ఐఎస్ఆర్-2026 అధికారికంగా ప్రారంభమై నట్లుగా నౌకాదళ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.ఇక 18వ తేదీ ఉదయం నేవల్ బేస్ యాంకరేజ్ ప్రాంతంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నావల్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్ ఐఎస్ఎస్ సుమేధ వాహనం నుంచి రాష్ట్రపతి ముర్ము నౌకాదళ పాటవాల్ని సమీక్షిస్తారు. అధ్యక్ష వాహనంగా ఎంపిక చేసిన సుమేధ నుంచిరాష్ట్రపతి ప్రెసిడెన్సియల్ ఫిట్ రివ్యూ (ఫిఎస్ఆర్) చేస్తారు. వివిధ స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలతో పాటు జలాంతర్గాములు, నేవల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైపాస్ విన్యాసాల్ని సమీక్షిస్తారు. సెయిలింగ్ వెసెల్స్ పరేడ్, హెలికాప్టర్ల ద్వారా సెర్చ్, అండ్ రెస్క్యూ ప్రదర్శన, మెరైన్ కమాండోల ప్రదర్శనను తిలకించనున్నారు. విన్యాసాల్లో 20 విదేశీ యుద్ధ నౌకలు, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ కు చెందిన 90 భారత నౌకలతో పాటు ప్రధాన ఆకర్షణగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియన్ ఐఎన్ఎస్ విక్రాంత్, తేజస్ యుద్ధ విమానాలు, ధ్రువ్ హెలికాప్టర్లు సహా 80కి పైగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు విన్యాసాల్లో పాలుపంచుకోను న్నాయి.19వ, తేదిన భారత నావికాదళ వైమానిక శక్తి ప్రదర్శనతో సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. దీనిలో త్రివిధ దళాలు, కోస్టార్డ్ మార్చింగ్ కంటింజెంట్లు, మిలటరీ బ్యాండ్లతో పాటు విదేశీ దళాలు వారి సెరిమోనియల్ బ్యాండ్ నిర్వహించనున్నారు. అదే విధంగా మిలాన్-2026 కూడా బుధ వారం ప్రారంభకా నుంది. 20వ తేదిన రక్షణదళం, నౌకాద ళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చిం చేందుకు ఇండియన్ ఓషన్ నేషనల్కాంక్లేవ్ (ఐఓఎన్ఎస్) సద స్సుని మహాసాగర్ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహిం చనున్నారు. ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్ లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు పాల్గొనున్నారు.
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి...మన స్వాగతం
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐ.ఎఫ్.ఆర్.) కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుండి భారతీ య వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా కు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమెకు విశాఖ విమానా శ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఇన్చార్జి మంత్రి డీవీబీ స్వామి ఆమెకు ఘన స్వాగతం. పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం. శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాస రావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంభబ్రత బాగ్బీ, తూర్పు నావికాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ డేగా నుంచి నేరుగా అతిధి గృహాం ఐఎన్ఎస్ చోళాకు వెళ్లి విశ్రాంతి తీసుకు న్నారు. సాయంత్రం తూర్పు నౌకదళం ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆత్మీయ విందులో పాల్గొని, అక్కడ నుంచి తిరిగి ఐఎన్ఎస్ చోసాకు చేరుకున్నారు. ఇక బుధవారం జరిగే ప్రెసిడిన్సియల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ. ముర్ముతో పాటు సిఎం చంద్రబాబు. గవర్నర్, డిప్యూటీ సిఎం. ఇతర మంత్రులు, నేవీ ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ కార్యక్రామనికి సంబంధించి నేవీ ఉన్నతాధికారులు, జిల్లా అధికార యంత్రాగం భద్రతా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.
ఆకట్టుకున్న రిహార్సల్స్...
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ నేపథ్యంలో విశాఖ సాగరతీరంలో ముందస్తుగా నిర్వహించిన రిహార్సల్స్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధ విమానాల ఘోష, సముద్రపు ఆలలపై ప్రతిధ్వనించిన దేశభక్తి స్వరాలు అక్కడికి చేరుకున్న ప్రేక్షకుల హృదయాల్ని కదిలించాయి. భారత నావికాదళం. కోస్టుగార్డుకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు సమన్వయం తో చేసిన విన్యాసాలు, చేతక్ హెలికాప్టర్ల నుంచి మెరైన్ కమాండోలు సముద్రంలోకి దిగిన తీరు, అక్కడి నుంచి మెరుపువేగంతో నేలమీదకు చేరిన యుద్ధ విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డోర్నియర్ విమానా లు. మిగ్-29, కమోచ్ కెఎ31 హెలికాప్టర్లు గర్జనలు ఆకాశాన్ని తాకుతూ సైనిక శౌర్యాన్ని ప్రతిధ్వనించాయి. ఈ రిహార్సల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా వివిధ దేశాలకు చెందిన సావికాదళ సిబ్బంది సమన్వయంతో కవాతు చేస్తూ అంతర్జాతీయ ప్రదర్శనలు చేశారు. నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల చాయిద్య గానం, ఎస్సీసీ క్యాడెట్ల కవాతు, భారతీ య శాస్త్రీయ నృత్య ప్రద ర్శనలు సముద్రతీరాన్ని సాంస్కృతిక వేదికగా మతిచా యి. 19వ తేదిన ఆర్కేబీచ్ వేదికగా నిర్వహించనున్న నీటి పరేడ్లో ఇవే ప్రదర్శనలు అతిధుల సమక్షంలో చేపట్టనున్నారు.