ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలు అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. చిత్ర బృందం వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించగా, గాయాలు తీవ్రంగా లేవని తెలిసింది. వైద్యులు ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని, త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నారని యూనిట్ తెలిపింది. ఈ వార్తతో అభిమానులు తొలుత ఆందోళన చెందగా, గాయాలు చిన్నవేనని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 'ఫౌజీ' చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సీతారామంతో ప్రశంసలు అందుకున్న ఆయన, ఈసారి మరింత ఎమోషన్తో కూడిన యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమాలో ప్రభాన్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించ నున్నారని సమాచారం. దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తుందని తెలుస్తోంది. గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలవనుందని, భారీ సెట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది.