నేరాల రూపం మారింది.. పోలీసింగ్ మారాలి
క్రైమ్ దర్యాప్తులో గోల్డెన్ అవర్ కీలకం
ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలి
రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం
ఇక ప్రతి నెలా పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టు
పరామర్శల పేరుతో రోడ్లపై విన్యాసాలతోనే ఇబ్బందులు
రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలి
రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఒక గర్వకారణమని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారుతోందని, దీనికి అనుగుణంగానే పోలీసింగ్ విధానంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉ ందని ఆయన అన్నారు. నేరాల నియంత్రణలో తక్షణమే ఆధారాలను సేకరించి, వాటిని పరిరక్షించడం అత్యంత కీలకమని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేర నియంత్రణలో 'గోల్డెన్ అవర్' అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌ స్ ఆఫీసర్ల వరకు పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీతో పాటు రేంజ్ ఐజీలు, డీఐజీలు, డీఎస్పీలు, ఎన్హెచ్ఎలతో సీఎం మాట్లాడారు. ఏపీ పోలీసుల కీర్తి దేశవ్యాప్తంగా మార్మోగేలా పనిచేయాలని, అందుకు అనుగుణంగా సిబ్బంది సిద్ధం కావాలని సూచించారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ను మరింత పెంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డీజీపీ నుంచి ఎసాచి వరకు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించడం ం ఇదే తొలిసారి అన్నారు. శాంతిభద్రతల విషయంలో లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు కీలకమన్నారు. 'ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్' విధానాన్ని అమలు చేయాలని అన్నారు. గడచిన రెండేళ్లలో కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం మేర తగ్గాయని సీఎం తెలిపారు. కాలానుగుణంగా నేరాల స్వరూపం కూడా మారుతోందని, డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు తదితరాలు కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. 2019-24 మధ్య పాలనలో గంజాయి, కల్తీ మద్యం ప్రధాన సమస్యలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, వారి గౌరవం పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14,770 సీసీ కెమెరాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న కెమెరాలను అనుసంధానించి మొత్తం లక్ష కెమెరాల నెట్వర్క్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేరాల దర్యాప్తులో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, డీఎన్ఏ డిటెక్షన్ వంటి ఆధునిక విధానాల వినియోగం పెరిగిందన్నారు. దీంతో నేరాలను వేగంగా గుర్తించగలు గుతున్నామని చెప్పారు. టెక్నాలజీ, నాలెడ్జ్, బెస్ట్ ప్రాక్టీసెనన్ను పోలీసు అధికారులు సమర్థంగా అమలు చేస్తే శాంతిభద్రతలను మరింత సమర్థంగా నియంత్రిం చవచ్చని సీఎం అన్నారు. రాజకీయ నేరాలు, డిజిటల్ నేరాలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు వంటి నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నేరం జరిగిన ప్రాంతాన్ని సంరక్షించడంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని సీఎం సూచించారు. నేర నియంత్రణలో గోల్డెన్ అవర్ విధానాన్ని పాటించాలని, నేరస్తులు తప్పు చేస్తే తప్పించుకోలేరనే భయాన్ని కలిగించాలని అన్నారు. వివేకా హత్య కేసు ఘటనలో పూర్తి సమాచారం బయటకు రాలేదని, పోలీసులు వైపు నుంచి జరిగిన కాస్ట్ మిస్టేక్ కారణంగానే అనేక సమస్యలు తలెత్తాయని సీఎం పేర్కొన్నారు. కొందరు కావాలనే దర్యాప్తును తప్పుదోవ పట్టించారని, ఇంట్లో రక్తపు మరకలతో సహా కీలక ఆధారాలను చెరిపేసే ప్రయత్నం జరిగినా వాటిని సంరక్షించడంలో విఫలమ య్యారని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నేరస్తుల పట్ల ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించకూడదని సూచించారు. దేశవ్యాప్తంగా 'జీరో డ్రగ్స్' లక్ష్యంతో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. మహిళల భద్రతతో పాటు గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం డ్రగ్స్ వద్దు బ్రో' ప్రచారాన్ని విస్తృతం చేయాలని సూచించారు. రోడ్డు భద్రత కూడా అత్యంత కీలకమైన అంశమని సీఎం అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైనేజీలు, రోడ్ ఇంజినీరింగ్, ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను ఆడిట్ చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శాంతిభద్రతల విషయంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలను అందరూ ఎదుర్కోవాల్సి ఉ టుందని సీఎం హెచ్చరించారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థపైనే మరక పడేలా చేస్తుందని అన్నారు. సింగయ్య వాహనం కింద పడి మృతి చెందిన ఘటనలోనూ ఎదురు ఆరోపణలు వచ్చాయని, జగన్ కారు కింద పడిపోయినట్లు వీడియోలు వెలువడ్డాయని, కారు ఢీకొట్టడంతో పొదల్లో పడిపోయిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే నెపం మోపే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో రాజకీయ పార్టీ ర్యాలీ సందర్భంగా రోడ్డుపై మోటార్సెకిల్ విన్యాసాలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై కూడా దాడులు జరిగే పరిస్థితి ఉందని, ఏ రాజకీయ పార్టీ అయినా రోడ్లపై ఇలాంటి విన్యాసాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించడం అన్ని పార్టీల బాధ్యత అన్నారు. రాజకీయ పార్టీ నేతలమనే కారణంతో నిబంధనలను ఉల్లంఘించే వారికి మినహాయింపు ఇవ్వలేమని చెప్పారు. ప్రస్తుతం రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న వారిలో 94 శాతం మంది ఒకే పార్టీకి చెందినవారుగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. పరామర్శలకు వెళ్లడం తప్పు కాదని, అయితే రోడ్లపై ప్రదర్శనలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. విశాఖపట్నంలో మూడు గంటల పాటు రోడ్లను బ్లాక్ చేయడంతో అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు వెళ్లే వారు, కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో తాను సీఎంగా ఉన్నప్పటికీ తన వాహన కాన్వాయ్‌ను కూడా కుదించుకున్నానని చెప్పారు. మానసిక పరిస్థితి సరిగా లేని కొందరు వ్యక్తులు చేసే నేరాలపై కూడా సమాజంలో చర్చ జరగాలని సీఎం అన్నారు. కొందరు రౌడీలు సామాజిక మాధ్యమాల్లో హీరోలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలపాలన్నదే లక్ష్యమన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్యకర ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు. నేర నిర్ధారణ రేటు పెరిగితే నేరాలు తగ్గుతాయని, పోలీసులు దర్యాప్తు చేసి విజయవంతంగా వరిష్కరించిన కేసుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారని సీఎం ఆరోపించారు. గతంలో మద్యం తాగించి యువతను రెచ్చగొట్టేవారని, ఇప్పుడు గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాలను ఉ పయోగించుకుని కొందరు నేరస్తులుగా మారుతున్నారని తెలిపారు. టెక్నాలజీ నేరస్తులను పట్టుకోవడంలో సహాయపడుతున్నప్పటికీ, అదే సమయంలో కొత్త రకాల నేరాలకు కూడా కారణమవుతోందని చెప్పారు. అందువల్ల బ్యాలెన్సింగ్, ప్రాపర్ పోలీసింగ్ అవసరమన్నా రు. పోలీసులంటే ప్రజల్లో గౌరవం, సంఘవిద్రోహ శక్తుల్లో భయం ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు శాంతిభద్రతలు కూడా కీలకమని, అప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకు పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక నుంచి ప్రతి నెలా పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టును విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. బెస్ట్ ప్రాక్టీసెస్, నక్సెస్ స్టోరీస్ సహా వివిధ అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1,200 పోలీసు స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో పాటు శాంతిభద్రతలు, ట్రాఫిక్, జీఆర్పీ తదితర విభాగాలకు చెందిన మొత్తం 1,650 మంది అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, శాంతిభద్రతల అదనపు డీజీ ఎన్. మధుసూదనరెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఱ్ఱా, ఈగల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ రవికృష్ణ తదితర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.