పిఠాపురం నుంచి కాకినాడకు నేరుగా రైలు
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరిన డిప్యూటీ సీఎం పవన్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. శక్తిపీఠం, పాదగయ, శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు ఉ న్న ఈ పట్టణానికి తగిన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో వినతిపత్రం సమర్పించారు. పిఠాపురం నుంచి కాకినాడకు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం సామర్లకోట మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణికులు, సరుకు రవాణాకు ఎక్కువ నమయం పడుతోందని, అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పీఎం గతి శక్తి పథకం కింద పిఠాపురం పరిధిలో సామర్లకోట ఉప్పాడ రోడ్డుపై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరిన పవన్.. ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందని అన్నారు. జాతీయ రైల్వే ప్రణాళిక 2030లోని మాన్యువల్ లెవల్ క్రాసింగ్లను తొలగించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఉ ంటుందని పవన్ వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మరికొంత మంది కేంద్రమంత్రులతో భేటీ అవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ సమావేశమవుతారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో డిప్యూటీ సీఎం భేటీ అవనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వలు పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరనున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షాతో పవన్ భేటీ...పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిల్షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను పవన్ కలిశారు. పిఠావురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమని.. అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ చర్చించారు. అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ను కలిసినట్లు పేర్కొంటూ, రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. మరో కీలక సమావేశం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశం జరిగిందని తెలిపారు. ఈ భేటీలో ఆంధప్రదేశ్‌లో కొనసాగుతున్న సమస్యలు, ప్రజలకు పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉప్పాడ సముద్ర రక్షణ గోడకు సంబంధించిన ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సాంకేతిక సలహా కమిటీ ముందు సమర్పించేందుకు కాకినాడ జిల్లా పరిపాలనకు అవకాశం కల్పించినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..