టీ20 వరల్డ్ ్కప్లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధం వీడడం లేదు. ప్రపంచకప్‌లో పాల్గొనడంపై శుక్రవారం లేదా వచ్చే సోమవారం నాటికి తమ తుది నిర్ణయం ప్రకటిస్తామని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చెప్పినప్పటికీ, టీ20 వరల్డ్‌కప్‌ను లేదా భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌ను బహిష్కరించే అవకా శం దాయాది దేశానికి లేదని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్ న్ను బహిష్కరిస్తామంటూ పాక్ బెదిరింపులకు దిగింది. అయితే ఈ దేశానికి ఆ ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. కాగా, టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే విషయమై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో అన్ని ఆప్షన్లను పాక్ ప్రధాని ముందుంచారు. "పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఫలప్రదమైన సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకు వివరించాను. అన్ని అవకాశా లనూ ఉపయోగించుకొని, సమస్యను పరిష్కరిం చాలని ఆయన ఆదేశించారు. తుది నిర్ణయం శు క్రవారం లేదా వచ్చే సోమవారం తీసుకుంటాం” అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌కు కొన్ని గంటల ముందు, బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ వ్యవహరిం చిన తీరుకు ప్రతీకారంగా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతిం చే అవకాశం లేదని పాకిస్థాన్ మీడియాలో ప్రచారం జరిగింది. ఒకవేళ టోర్నీలో పాల్గొన్నా ఫిబ్రవరి 15న భారత్‌లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్న పాక్ బహిష్కరించే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం, ఇలాంటి నిర్ణయాలు పీసీబీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందా న్ని ఉల్లంఘిస్తే, పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని పీసీబీ వర్గాలకు ఐసీసీ స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ టోర్నీల నుంచి నస్పెన్షన్, ఆసియా కప్‌లో పాల్గొనే హక్కు కోల్పోవడం, పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడే ఆటగాళ్లకు విదేశీ లీగ్ ల కోసం ఇచ్చే ఎన్ఎసీలను నిలిపివేయడం వంటి చర్యలు ఎదుర య్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరో వైపు, పాకిస్థాన్ మ్యాచ్‌లు తమకు అనుకూలంగా ఎంపిక చేసిన వేదికలోనే జరగనున్న నేపథ్యంలో, భారత్‌తో మ్యాచ్‌ను లేదా మొత్తం వరల్డ్ కప్‌ను బహిష్కరిం చడానికి సరైన కార ణాలు లేవన్న అభిప్రా యం కూడా వ్యక్తం అవు తోండి. ఇక మరో కీలక అంశం ఏంటంటే ఒకవేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పు కుంటే, బంగ్లాదేశ్‌ను మళ్లీ వరల్డ్ కప్‌కు పిలిచే అంశా న్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే, బంగ్లా దేశ్ తమ మొదటి డిమాండ్ ప్రకారం శ్రీలం కలోనే అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుందని, ఇది లాజిస్టిక్‌గా కూడా పెద్ద సమస్య కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్, శ్రీలం క వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు జరగనుం ది. అయితే ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఆడనుంది.