ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ జట్ల పోరు!
తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ తోక ముడిచింది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా చివరికి తన నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టు టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడదని ఫిబ్రవరి 1న ప్రకటించింది. కొన్ని రోజుల హైడ్రామా తర్వాత, పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదట పాక్ కి 3 కండీషన్లు పెట్టింది. అయితే ICC వాటిని అంగీకరించలేదు. దాంతో చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ దిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి.ఈ ఆసియా జట్లు గ్రూప్ 'ూలో ఉన్నాయి. భారత్ తన మొదటి మ్యాచ్ అమెరికా (ఖూూ)ని ఓడించగా, నెదర్లాండ్స్ జరిగిన తన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. పాకిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ అమెరికాతో తలపడనుంది. భారత్ గురువారం నాడు. తమ రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. తమ మూడవ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఢీకొంటాయి. మైదానం బయట మాటల తూటాలు పేల్చుతున్న పాక్ జట్టు మ్యాచులో ఏం చేస్తుంది, ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్, పాకిస్తాన్ జట్ల పోరు 27వ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 15న) ఐసీసీ షెడ్యూల్ చేసింది. భారత్, పాక్ మధ్య మ్యాచ్ తటస్థ వేదికలో జరుగుతుంది. గత కొన్నేళ్లుగా పాక్ లో మ్యాచులు ఆడటం లేదు. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ICC ఈవెంట్స్‌లో భారత్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్ జట్టు భారత్ రావడానికి నిరాకరిస్తోంది. భారత్ సైతం పాక్ తో స్వదేశంలో మ్యాచులకు సిద్ధంగా లేదు. టీ20 వరల్డ్ కప్ లో ఈ జట్లు తటస్థ వేదిక అయిన కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఈసారి పొట్టి ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంక జట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 15న టీ20 ప్రపంచ కప్ మొత్తం 3 మ్యాచ్‌లు ఉన్నాయి. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 6:30 గంటలకు వేస్తారు. భారత్, పాక్ మ్యాచ్ కనుక వీకెండ్ అందులోనూ ఆదివారం వచ్చేలా ఐసీసీ షెడ్యూల్ చేసింది. ఈ మ్యాచ్ బ్రేక్ 10 సెకన్ల యాడ్ సైతం ఐసీసీకి కోట్లలో ఆదాయం సమకూరుస్తుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియోహోట్ స్టార్ యాప్, వెబ్సైట్లో భారత్, పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లైవ్ ఇస్తారు. రాత్రి 7 గంటలకు ఈ ఉత్కంఠభరిత పోరు ప్రారంభం కానుంది.