పాకిస్తానికి చెందిన హాకీ జట్టు ఆస్ట్రేలియాలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోటల్ బిల్లు చెల్లించలేక దీనమైన పరిస్థితుల్లో వీధుల్లో జట్టు కూర్చోవలసి వచ్చింది. ప్రొ లీగ్ రెండవ లెగ్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జట్టు దగ్గర తగినంత డబ్బు లేకపోవడం కారణంగా.. టీంకు టీమే వీధుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురయింది. అయితే వారు అక్కడ అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ హాకీ జట్టుకు సంబంధించిన వారంతా ఫోర్ స్టార్ హోటల్లో బస.. అయితే పాకిస్తాన్ హాకీ జట్టుకు సంబంధించిన అధికారులు, పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డ్ హోటల్ కోసం ప్రత్యేకమైన అడ్వాన్స్ ను చెల్లించినట్లు కూడా హాకీ జట్టుకు పేర్కొంది. అయితే, జట్టులో ఉన్న సభ్యులందరూ కాన్బెర్రా చేరుకున్న తర్వాత.. హోటల్ రిసెప్షన్ లో వారికి కేటాయించిన రూముల సమాచారాన్ని అడగ్గా... హోటల్ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి బుకింగ్ చేయలేదని.. అలాగే అడ్వాన్స్ చెల్లించలేదని స్పష్టం చేశారు.. దీంతో వెంటనే అక్కడే ఉన్న పాకిస్తాన్ హాకీ జట్టు ప్రధాన కోచ్ తాహిర్ జమాన్ పాకిస్తాన్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ నిధుల కోరత కారణంగా.. గంటలు గడిచిన వారు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి సహకారాలు పొందలేకపోయారు.. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చిన పాకిస్తాన్ హాకీ జట్టుకు విశ్రాంతి లేకపోవడం, ఎలాంటి సహాయ తినడానికి తిండి లేకపోవడం, ఉండడానికి చోటు లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. అంతేకాకుండా వారు అక్కడి నుంచి ఓ చిన్న హోటల్కి వెళ్లారు.. అక్కడ ఒక్క గదిలోనే దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ప్లేయర్స్ ఉండాల్సి వచ్చిందని సమాచారం. ఆ మరుసటి రోజు వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో మైదానానికి తిరిగి రావాల్సి వచ్చిందని తెలుస్తోంది. అక్కడ ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో ఓడిపోయారు.. పాకిస్తాన్ హాకీ జట్టు అన్ని విధాల సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా తో పాటు జర్మనీ వంటి అగ్ర జట్ల కంటే ఈ జట్టు నిరంతరం వెనకబడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ జట్టు ఆరు మ్యాచ్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. కానీ కాన్బెర్రాలో జరిగిన సంఘటన ఆట కంటే ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. హాకీ జట్టుకు సంబంధించిన అందరూ ప్లేయర్స్ అవమానాన్ని ఎదు-ర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అర్జెంటీనాలో జరిగిన ప్రో లీగ్ సమయంలో కూడా వీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.