దేశ రాజ దాని ఢిల్లీ రెండో రోజూ దద్దరిల్లింది. నీట్ తది తర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థు లపై పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారం రాజధా నిని కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు మెరుపు ధర్నాకు దిగాయి. మంగళవారం సాయంత్రం అనూ హ్యంగా 7, లోక్ కల్యాణ్ మార్లోని ప్రధాని నివాసాన్ని ముట్టడించాయి. మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ ఊహించని ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఆధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, డీకే శివకుమార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత సుప్రియా సూలేతోపాటు ఇండియా కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ముట్ట డిలో పాల్గొన్నారు. ముందస్తు సమాచారం' లేకుండా ఆకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో పోలీసులు, వచ్చి భద్రతాసిబ్బంది ఖంగుతిన్నారు. ధర్నా విరమించాలంటూ కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కాంగ్రెస్ నాయకులను అభ్యర్థిం చారు. అందుకు వారు నమ్మతించక పోవటంతో, పోలీసులు వారిని బల వంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ ముఖం, చేతుల మీద స్వల్ప గాయాలయ్యాయి. ఈ నిరసన ప్రణాళికను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. లాఠీచార్జీలో గాయపడి ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ నేతలు మంగళవారం ఉదయం పరామర్శిం చారు. అక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్లారు. మంగళవారం ఖర్గే జన్మదినం కావటంతో ఆయనను అభినందించారు. అక్కడి నుంచి విజయ్ చౌక్‌కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే, ఈ విషయం బయటకు తెలియటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లే పోలీసులు అడు కునే అవకాశాలే ఉన్నాయని తెలియటంతో కాంగ్రెస్ నేతలు ప్రణాళిక మార్చారు. ఖర్గే నివాసానికి 23 కి.మీ.ల దూరంలో ఉండే ప్రధాని మోదీ నివాసం వద్దకు వెళ్లి మెరుపు ధర్నాకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీలను ఖర్గే నివాసానికి పిలిపించారు. విషయం తెలిసి ఎంపీలు సైతం ఆశ్చర్యపోయారు. కేరళ సీఎం సతీశన్, కర్ణాటక సీఎం శివకుమార్ సైతం హుటాహుటిన వచ్చారు. బర్గే నివాసం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి బయల్దేరి, ప్రధాని నివాసం వద్దకు వచ్చి అక్కడ అకస్మాత్తుగా బైఠాయించారు. అది భద్రతపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావటంతో.. ఈ హఠాత్ పరిణామంతో పోలీసు సిబ్బంది నివ్వెరపోయారు.
ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలు.. విద్యార్థు లపై దమనకాండకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజల స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంకలను అమలు చేస్తుందనటానికి నిదర్శనంగా తమ చేతు లను జిప్ టైలతో బంధించుకున్నారు. 'దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు. విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి చేయ డమే. మోదీ, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ప్రతి దేశభక్తుడైన భారతీ-యుడూ ఈ పోరాటంలో కలిసిరావాలి' అని రాహుల్ గాంధీ పిలు పునిచ్చారు. ఎటువంటి పర్యవసానాలు, జవాబుదారీ తనం లేకుండా తప్పించుకోవచ్చని మోదీ భావిస్తు న్నారుగానీ.. ఈసారి అలా జరగదని హెచ్చరించారు. 'విద్యార్థుల మీద జరిపిన దారుణమైన లాఠీచార్టీకి ఈ పిరికిపంద నియంతృత్వ ప్రభుత్వం జవాబు చెప్పాలి. యువతకు మోదీ, అమిత్ ద్రోహం చేశారు. వారు రాజీనామా చేయాలి' అని ఖర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ధర్నాతో ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాహుల్‌తో జితేంద్రసింగ్ చర్చలు
పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. విపక్షాలను శాంతింపజేసేందుకు రంగంలోకి దిగింది. దాదాపు 20 నిమిషాల నిరసన తర్వాత, ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) సహాయ మంత్రి జితేంద్ర సింగ్. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వచ్చి రాహుల్‌గాంధీతో చర్చలు జరిపారు. అయితే, రాహుల్ మాత్రం పట్టు వీడ లేదు. 'యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రాజీ నామా చేయాల్సిందే' అని డిమాండ్ చేశారు, రాయ బార యత్నాలేవీ ఫలించకపోవడంతో మంత్రి జితేంద్ర సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చర్చలు ఫలించలేదని, తాము రాత్రంతా ఇక్కడే ఉండి, ధర్నా జరుపుతామని కాంగ్రెస్ నేతలు ప్రక టించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది.
1. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీ నామా చేయాలి.
2. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయించినందుకు, అక్రమ కేసులు బనాయించి నందుకు హోంమంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలి.
3. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో నీట్ అంశంతో పాటు దేశంలో విద్యావ్యవస్థ వైఫల్యా లపై పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేసింది. అయితే, కేంద్రమంత్రి జితేంద్రసింగ్ దీనికి భిన్న మైన వాదన వినిపించారు. 'నీట్ పరీక్షకు సంబంధిం చిన అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే తాను వెంటనే ధర్నాను విరమిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. మా ప్రభుత్వ అగ్రనాయ కత్వం అనుమతితో కొద్దిసేపట్లోనే ఆయన డిమాం డు ఆమోదం తెలిపాం. నీట్ అంశంపై పార్లమెం ట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే హామీని రాహుల్‌గాంధీకి నేను స్వయంగా తెలిపాను. కానీ, ఆయన మాట మార్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. మొదట కేవలం చర్చ మాత్రమే కోరారని మేం గుర్తు చేయగా, 'ఇప్పుడు నా డిమాండ్లు మారాయి' అని ఆయన సమాధానమిచ్చారు. ౧ ఆయన లాంటి సీనియర్ నేత ఇచ్చిన మాట నుంచి అంత త్వరగా వెనక్కి తగ్గడం ఏమిటంటూ వివరిం చేందుకు ప్రయత్నించగా, అది నా ఇష్టమంటూ రాహుల్ బదులిచ్చారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు ఏమాత్రం తగినట్లుగా లేదు అని జితేంద్రసింగ్ విమర్శించారు.
రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు
ధర్నాను విరమించటానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించకపోవటంతో పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లటానికి ప్రయత్నించారు. రాహుల్‌గాంధీ ప్రతిఘటిస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్కచే యకుండా నేల మీద నుంచే ఈడ్చుకెళ్లారు. ఫలి తంగా, రాహుల్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఆయన ముక్కు నుంచి రక్తం కారినట్లుగా కనిపించింది. ఈ సమయంలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ 'భారతదేశంలో ప్రజాస్వామ్యం వరిస్థితికి ఇది ప్రత్యక్ష నిదర్శనం' అంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ప్రియాంక గాంధీని సైతం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వాహనం లోకి తీసుకెళ్లారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్ త్సంగ్చన్ని కే సురేశ్, సుఖీందర్ రణ్ ద్వా, పవన్ భేరా తదితరులను కూడా పోలీసులు బలవం తంగా తరలించారు. అరెస్టు చేసిన నేతలను ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాహుల్‌ను ఛత్రసాల్ స్టేడియంలో, ప్రియాంక గాంధీజీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఉ ంచారు. మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్లో ఉన్న ప్రియాంక సహా ఇతర ఎంపీలను కలిసేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ వెళ్లారు. అయితే, పోలీసులు సోనియాగాందీని లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రాహుల్, ప్రియాంక తదితర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు.