శర్వానంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'బైకర్' థియేటర్లలో సౌండ్ గట్టిగానే చేస్తోంది. ఇండియాలో ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే పాజిటివ్ బజ్ ఉంది. దానికి తోడు సీనియర్ హీరో రాజశేఖర్ తండ్రి పాత్రలో కనిపించడం సినిమాకు మరింత హైప్ తీసుకు వచ్చింది. ఈ సినిమా కేవలం ఇక్కడే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా బాక్సాఫీస్ దగ్గర తన బలాన్ని చాటుకుంటోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ రేసింగ్ డ్రామాకు మంచి స్పందన లభిస్తుండటం విశేషం. అసలు విషయానికి వస్తే, 'బైకర్' చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో వి150ఖ మార్కును క్రాస్ చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. శర్వానంద్ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి అక్కడ డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. కేవలం క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ థ్రిల్లర్లను ఇష్టపడే యువత కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను విదేశాల్లో భారీగానే విడుదల చేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, వసూళ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని, లాంగ్ రన్లో ఇది శర్వా కెరీర్లో ఒక మంచి ఓవర్సీస్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలోని విజువల్స్ గురించి మాట్లాడుకుంటే, రేసింగ్ సీక్వెన్స్ లు అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయి. కెమెరా వర్క్, మోటో క్రాస్ బైక్ స్టంట్స్ ఆడియన్స్‌కు ఒక కొత్త అనుభూతిని ఇస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో డైలాగ్స్ యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.యాక్షన్ బ్లాక్స్ విషయంలో దర్శకుడు అభిలాష్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదు. మట్టి రోడ్లపై, కొండల మధ్య బైక్ లతో చేసే విన్యాసాలు వెండితెరపై చాలా నేచురల్ గా అనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ రేస్ సీన్ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. మాళవిక నాయర్ పాత్ర కూడా కథలో చక్కగా ఇమిడిపోయింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.