నటుడు ప్రభాస్ ఫుడ్ లవర్... ఆయన వెరైటీ ఫుడ్ ఇష్టపడతారు. అందరికీ నా ఫుడ్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మీకో ఆసక్తికర విషయం చెబుతాను. నేను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను. 'ఆదిపురుష్' షూటింగ్ ముంబయిలో జరిగేటప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టా. టీమ్ అందరూ షాక్ అయ్యారు. ఫ్లైట్‌లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీరు మాములు వాళ్లు కాదండీ' అంటూ చేసిన కామెంట్స్‌ను ప్రభాస్ గుర్తుచేసుకున్నారు. 'కపుల్ ఫ్రెండ్లీ' చూసి ఆ ఫీల్ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని అగ్రనటుడు ప్రభాస్ అన్నారు. చివరి 20 నిమిషాలు మరో స్థాయిలో ఉందని ప్రశంసించారు. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రభాసనన్ను కలిసింది. ఆ చిత్ర బృందంతో ప్రభాస్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయవాడ పునుగులు అంటే తనకు ఇష్టమని చెప్పారు. నేను అభిమానుల కోసం సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కానీ, ఒక్కటే విడుదలవుతోంది. నాకు 'గీతాంజలి' అంటే చాలా ఇష్టం. అందరూ నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టమనుకుంటారు. నాకు అన్ని జానర్ల పైనా ఆసక్తి ఉంది. ప్రత్యేకించి మణిరత్నం అభిమానిని అంటూ 'కపుల్ ఫ్రెండ్లీ' చూసినప్పుడు నాకు 'గీతాంజలి' చూస్తున్న ఫీల్ కలిగింది. అందుకే నాలుగు సార్లు చూడాలని నిర్ణయించుకున్నాననన్నారు. పూరి జగన్నాథ్ ఎవరూ రాయలేరు. ఆయన 'బుజ్జిగాడు' కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎలా చేయాలి అని టెన్షన్ వచ్చింది. తర్వాత ఆయన దర్శకత్వంలో 'ఏక్ నిరంజన్' చేశా. ఆయనలా డైలాగులు రాసేవాళ్లు ప్రపంచంలోనే లేరు. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. నా సినిమాల్లో కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉండేలా చూస్తాను అన్నారు. మీ దృష్టిలో ప్రేమంటే ఏంటి?' అని హీరోయిన్ మానస వారణాసి అడగ్గా.. పర్సనల్ క్వశ్చన్ కదా అంటూ ప్రభాస్ నవ్వులు పూయించారు. లవ్ అనగానే ప్రస్తుతానికి 'కపుల్ ఫ్రెండ్లీ' గుర్తొస్తుందన్నారు. ఈ సినిమా చూశాక ప్రేమలో పడాలని ఉందన్నారు. హీరో సంతోశ్ శోభన్ అడిగిన వెంటనే.. అతడికి ఫోన్ నంబరు ఇచ్చారు. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. చెన్నైలో తాను గడిపిన రోజులు గుర్తుచేసుకున్నారు. ప్రభాస క్కు హిట్ ఇచ్చిన 'వర్షం' డైరెక్టర్ శోభన్ తనయుడే ఈ సంతోశ్.