రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు
మరో 15 రోజులకు అవసరమైన నిల్వలు
త్వరలోనే మరింత గ్యాస్ సరఫరా
కేజీ బేసిన్ గ్యాస్ ను పైప్డ్ నెట్వర్క్ పెంచాలి
ప్రజలు పానిక్ కాకుండా చైతన్య పరచాలి
అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన
మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల
రాష్ట్రంలో ప్రస్తుతం 14వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మరికొన్ని టన్నుల గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందుల్లేవని, ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు కొరత రాకుండా చూడాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ నుంచి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. ఈ కేవైసీ, ఓటీపీల ద్వారా సిలిండర్ల డైవర్షన్ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్ లభ్యత పెరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉత్పత్తి పెంపు, మె-రుగైన పంపిణీ జరిగేలా చూడాలని ఇద్దరు పరస్స్ పిలాబాద్, షెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ ప్రతినిధులకు సూచించారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను మరింత విస్తరించాలని.. కేజీ బేసిన్ గ్యాస్‌ను పైన్డ్ నెట్వర్క్ ద్వారా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగం గరిష్ఠంగా పెంచాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజలు ప్యానిక్ అవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్లను పెంచేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంచి, మెరుగైన వంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్స్ను మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయ-వును పైఫ్ట్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని పేర్కొన్నారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్ఠంగా పెంచే అవకాశాలను పరిశీలించాలని మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సమావేశానంతరం ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని పైరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. 100 శాతం ప్రజలకు గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఉ డేవారని... ఇప్పుడు వారు ఆరోగ్యశాఖ కిందకు మారినట్లు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత ఉ ందని... వాటిని త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. ఎక్కడ అక్రమ రవాణా జరుగుతున్నా ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో గృహావసరాల కోసం ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు సగటుగా 2.81 లక్షల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ లు జరుగుతాయని, ప్రస్తుతం రోజుకు సుమారు 2.92 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ఒక్కసారిగా ఎక్కువ బుకింగ్‌లు చేయడంతో సర్వర్లు జామ్ అవుతున్నాయని చెప్పారు. కేంద్ర నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాతే మరో గ్యాస్ సిలిండర్ బుకింగు అనుమతి ఉంటుందని గుర్తు చేశారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ఓటీపీ ద్వారా మాత్రమే గ్యాస్ సిలిండర్ డెలివర్ చేసే విధానం అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే 616 కేసులు నమోదు చేసి 2500 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు యాప్, ఫోన్ కాల్, వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఆన్లైన్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని మంత్రి సూచించారు. +-రజలు పుకార్లను నమ్మకుండా సంయమనం పాటించాలని, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.