టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఫిబ్రవరి 15న జరగబోయే మ్యాచ్‌లో ఆడబోమని పాక్ ఇప్పటికే స్పష్టం చేసింది. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లు ఆడతామని, ఇండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు దాయాది దేశం ప్రకటించింది. అయితే తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్'తో తాము మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్? లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'టీ20 వరల్డ్ కప్ విషయంలో మేం స్పష్టమైన వైఖరి తీసుకున్నాం. భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. అయినా ఇది సరైన నిర్ణయమే' అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అంతకుముందు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఎలాంటి కారణం చెప్పకుండా భారత్'తో జరిగే మ్యాచ్'లో తమ జట్టు మైదానంలోకి దిగదు అని పేర్కొంది. ఈ విషయాన్ని ఎక్స్? వేదికగా ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగే గ్రూప్-దశ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ నిర్ణయించిందని తెలిపింది. ఈ ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఎంపికచేసుకుని మ్యాచ్‌లు ఆడటం గ్లోబల్ టోర్నమెంట్ స్ఫూర్తికి విరుద్ధం. అన్ని అర్హత పొందిన జట్లు షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిందే. ఇది క్రికెట్ సమగ్రత, న్యాయం, పోటీ తత్వాన్ని దెబ్బతీస్తుంది. జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రలను ఐసిసి గౌరవిస్తుంది. అయినప్పటికీ ఈ నిర్ణయం ప్రపంచ క్రీడకు లేదా పాకిస్థాన్? లోని లక్షలాది మంది అభిమానుల సంక్షేమానికి అనుకూలంగా లేదు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన సొంత దేశంలో క్రికెట్‌కు ఉన్న ముఖ్యమైన, దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఐసిసి ఆశిస్తోంది. ఎందుకంటే ఇది ప్రపంచ క్రికెట్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పీసీబీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నాం' అని ఐసీసీ పేర్కొంది. భద్రతా కారణాలంటూ భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. భారత్ లో భారత్'లో జరగాల్సి ఉన్న తమ మ్యాచ్? ల ? వేదిక మార్చాలని కోరింది. అయితే దీనిని ఐసీసీ తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్? జట్టు భారత్?లో మ్యాచ్'లు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఐసీసీ స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా తీసుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో జట్లు ఆడటానికి నిరాకరించడం ఇది మొదటిసారి కాదు. 1996లో భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా, వెస్ట్'ఇండీస్ జట్లు శ్రీలంకలో ఆడేందుకు నో చెప్పాయి. 2003లో ఇంగ్లాండ్ జింబాబ్వేతో, న్యూజిలాండ్ కెన్యాలో ఆడేందుకు నిరాకరించాయి. సమయాల్లో కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యర్థి జట్లకే పాయింట్లు కేటాయించారు. ఇటీవల జింబాబ్వే, న్యూజిలాండ్ అండర్ 19 జట్లు కూడా ఇదే తరహాలో తప్పుకున్నప్పుడు ఐసీసీ కఠినంగానే వ్యవహరించింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రసారదారులకు, స్పాన్సర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. 2012 నుండి ఐసీసీ కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచుతూ వస్తోంది. ఇప్పుడు పాక్ బహిష్కరణ వల్ల కేవలం పాయింట్లే కాకుండా క్రికెట్ ప్రపంచానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పరుగులు, వికెట్లతో తేలాల్సిన ఈ మ్యాచ్ ఇప్పుడు నిబంధనల పుస్తకాలతో ముగియనుండటం క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఇక పాక్ తీసుకున్న ఈ రిస్క్ ఆ జట్టు భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంది. మరి ఐసీసీ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.