డిసెంబర్ 4న నితిన్, నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. 'అలియాన్ రుక్మిణి', 'వృషకర్మ' ఒకే రోజు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అయితే ఈ పోటీలో హీరోల కంటే దర్శకుల గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరూ గత సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు పెద్ద హీరోలతో తమ సత్తా చూపించే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే వీళ్లిద్దరూ ఎంచుకున్న కథలు, బడ్జెట్లు పూర్తిగా వేరు. 'దండోరా'తో దర్శకుడిగా పరిచయమైన మురళీకాంత్ దేవసోత్ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కుల వివక్ష, పల్లెటూరి భావోద్వేగాలతో రూపొందించిన ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నితిన్ 'అలియాస్ రుక్మిణి' చేస్తున్నారు. ఈసారి సామాజిక సమస్యల జోలికి వెళ్లకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. పైగా 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' ఫలితాలతో ఇబ్బందుల్లో ఉన్న నితిన్‌కు హిట్ అందించాల్సిన బాధ్యత కూడా మురళీకాంత్పై ఉంది. ఇక కార్తీక్ దండు ట్రాక్ మరోలా ఉంది. 2015లో 'భమ్ బోలేనాథ్' తో దర్శకుడిగా పరిచయమైన కార్తీక క్కు మొదటి సినిమా కలిసిరాలేదు. కానీ 2023లో 'విరూపాక్షతో భారీ విజయం అందుకున్నారు. ముఖ్యంగా మిస్టరీ, చేతబడుల నేపథ్యంలో సాగిన కథను తెరకెక్కించిన విధానం మెప్పించింది. ఇప్పుడు 'వృషకర్మ'తో నాగచైతన్యను పురాణాలతో ముడిపడిన అడ్వెంచర్ కథలో చూపిస్తున్నారు. 'తండేల్' తర్వాత చైతూ చేస్తున్న భారీ సినిమా కావడంతో కార్తీకై పై అంచనాలు కూడా ఎక్కువే. ఇక్కడ ఇద్దరు దర్శకుల మధ్య మరో తేడా ఉంది. మురళీకాంత్ తనకు గుర్తింపు తెచ్చిన జానర్‌ను వదిలి నితిన్‌తో ప్రేమకథ చేస్తున్నారు. కార్తీక్ మాత్రం 'విరూపాక్ష'లో ఉపయోగించిన మిస్టరీని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారు. ఒకరు కొత్త జానర్లో తన రైటింగ్‌ను నిరూపించుకోవాలి. మరొకరు గత హిట్‌కు మించిన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇద్దరికీ తమ గత సినిమాలతో ఏర్పడిన అంచనాలే పెద్ద ఛాలెంజ్.