ప్రముఖ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శ్రీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. హ్యాపీ డేస్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇంకా వరుస అవకాశాలు అందుకుంటూ చెక్కుచెదరని అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వయసు పెరిగినా.. తరగని అందం ఈమె సొంతం. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూనే.. మరికొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు స్పెషల్ సాంగ్ లలో నర్తిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోస్తున్న విషయం తెలిసిందే. అయితే తన గ్లామర్ కి తగ్గట్టుగా తన బిజినెస్ ని కూడా మరింత పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తోంది తమన్నా భాటియా. అసలు విషయంలోకెళితే 15 సంవత్సరాలకు పైగా అభరణాల రిటైల్ వ్యాపారంలో అనుభవం ఉన్న తన తండ్రి నుండి స్ఫూర్తి పొందిన ఈమె సొంతంగా తమన్నా ఫైన్ జువెలరీ పేరుతో ఒక స్టోర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి వ్యవస్థాపకురాలిగానే కాకుండా క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా తమన్నా పనిచేస్తున్నారు. ఇందులో రోజు వారీ ధరించగలిగే విలాసవంతమైన ఆభరణాల పైన దృష్టి పెట్టారు.. ప్లమ్స్టియష్, ది ఫ్లిక్, హాఫ్ అండ్ హాఫ్ వంటి సొగసైన డిజైన్లను ఈ స్టోర్ ద్వారా అందిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్న తమన్నా ఒకవైపు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు వీటిని తన ఔట్ఫిట్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ గా ధరించి తన వ్యాపారాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకుంటుంది. మొత్తానికి అయితే తమన్నా భాటియా ఒకవైపు గ్లామర్ తో మరొకవైపు తన స్టోర్ జువెలరీని ధరించి పబ్లిసిటీ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఏది ఏమైనా తమన్నా తెలివితేటలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.