గ్లామర్ బ్యూటీగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కియారా అద్వానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈమె.. తొలిసారి తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో వెండితెరకు పరిచయ-ఎమైంది.మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. పైగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. అయినా సరే మళ్లీ రాంచరణ్ హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో మరో అవకాశం లభించలేదు. కానీ కన్నడ ఇండస్ట్రీలో యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈమె కెరీర్ కు ఏ ఒక్క సినిమా కూడా తోడ్పడలేదు అనే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈయన.. మరొకవైపు మ్యాగజైన్ కవర్ పేజీలపై దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 2026 నవంబర్లో విడుదలైన ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ డిజిటల్ కవర్ స్టోరీ కోసం చేసిన ప్రత్యేక ఫోటోషూట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.