శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు
సుప్రీంకోర్టు లాయర్ల సంఘీభావం..
సెలబ్రిటీల సానుకూల పోస్టులు
జంతర్ మంతర్ వద్ద అదే ఉద్వేగం.. అదే అకుంఠిత దీక్ష
పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులయత్నం
ఎక్కడికక్కడ బారికేడ్లతో నిలువరించిన పోలీసులు
కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేసే దాకా ఉద్యమం ఆగదని సీజేపీ స్పష్టీకరణ
నడ్డా నివాసంలో చర్చలకు నో
ప్రధాని మోడీ ప్రకటనపై అసంతృప్తి
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వల్ల ఒరిగేదేమీ లేదని తోసిపుచ్చిన కాక్రోచ్ పార్టీ
నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో పాటుగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆరంభమైన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన కార్యక్రమం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో జూలై 24న దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలోనూ ఒక రోజు ఒక డిమాండ్ అనే నినాదంతో ఈ నిరసనలు జరగాలని సీజేపీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పోస్టర్ విడుదల చేసింది. తమ తమ జిల్లాల్లో అవసరమైన అనుమ తులు తీసుకుని శాంతియుతంగా సమావేశాలను నిర్వహిం చాలని విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలనుకోరింది. సమావేశాల్లో నిరసనకారుల డిమాండ్లను బహిరంగం గా చదివి వినిపించాలని కూడా సూచించింది. సంస్థ వెబ్సైట్లో వివరణాత్మక ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రచార సామాగ్రి, వినతి పత్రం నమూనా అందుబాటులో ఉన్నాయని సీజేపీ తెలిపింది. జూలై 20న ఢిల్లీలో జరిగిన సంసద్ చలో మార్చ్ సందర్భం సందర్భంగా నిరసనకారులు, పోలీసు ల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఈ దేశవ్యాప్త పిలుపు వచ్చింది. ఇరువైపులా పెద్ద ఎత్తున బలప్రయోగం జరిగిన ట్లు ఆరోపణలు వచ్చాయి. ఆనేక ఎఫ్వఆర్లు నమోదయ్యాయి. నీట్ పేపర్ లీక్ కేసుల్లో చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయా లనే కీలకమైన డిమాండ్లను సీజేపీ వేస్తోంది. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
నడ్డా నివాసంలో చర్చలకు సీజేపీ నో
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని చెప్తూనే జంతర్ మంతర్ లేదా తటస్థ వేదిక పైనే మాట్లాడాలని సీజేపీ గట్టిగా పట్టు బట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాల యంలో సమావేశం జరగదని స్పష్టం చేసింది. గురువారం మళ్లీ చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వీడియో సందేశంలో గత 24 గంటల్లో నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నడ్డా నివాసం లేదా కార్యాలయంలో మీ సౌకర్యం ప్రకా రం ఎప్పుడైనా చర్చలు జరపవచ్చని ఆహ్వానించారు. సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రండా సోషల్ మీడియాలో స్పంది స్తూ జేపీ నడ్డా నివాసంలో సమావేశం జరగదని చెప్పారు. ప్రజా కోర్టు ఇక్కడే ఉందని మంత్రులు ప్రజల మధ్యకు రావా లని జంతర్ మంతర్‌లోనే చర్చలు జరగాలని పేర్కొన్నారు. భద్రతా సమస్యలు ఉంటే నిరసన స్థలం దగ్గర, తటస్థ వేదికపైనా చర్చలకు సిద్ధమని చెప్పారు.
మోడీ ప్రకటనపై అసంతృప్తి
ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పినా అది అసలు సమస్యను పరిష్కరించదని స్పష్టం చేసింది. కేవలం దృష్టి మరల్చే ప్రయత్నమని విమర్శించింది. ప్రధాని దేశం లోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో క్రూరమైన జోక్ చేస్తున్నారని జాతీయ ప్రతినిధి ఆశుతోష్ రంకా నిమ ర్శించారు. పేపర్ లీక్‌లు జరగడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోవడం కారణం కాదని రంకా చెప్పారు. విద్యా మంత్రి ధర్మేంద్రప్రధాన్ పూర్తి అసమర్థత వల్లనే వల్లనే ఇవి జరుగుతున్నా యని ఆరోపించారు. చారు. సురక్షితమైన పరీక్ష వ్యవస్థను నిర్మించ డంలో విఫలమయ్యారని. ఈ రోజు దేశ యువత ఒక్కటే బోరుతోందని, అది జవాబుదారీతనం అని స్పష్టం చేశారు.
మోడీతోనే యువత భవిత నాశనం: రాహుల్
ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తీవ్రంగా విమర్శించారు. యువత భవిష్యత్తును అత్యధిక దెబ్బతీసింది మీరే అని ఆరోపించారు. సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. విద్యావ్యవస్థను పూర్తిగా ఆక్రమించి నాశనం చేయడానికి అనుమతించారని, ప్రోత్సహించారని దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని రక్షించారని ఆరోపించారు. నిరసనకారులు లేవనెత్తుతు న్న మూడు దేవాండ్లను రాహుల్ గాంధీ పునరుద్ఘా టించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని, విద్యార్ధు లకు క్షమాపణ చెప్పాలని, వారిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనికోరారు.