ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్ రాబోతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. గురువారం ఉదయం 9 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్టు ఎక్స్ (Twitter) వేదికగా ప్రకటించారు.
పెట్టుబడుల వాతావరణం… తిరిగి ఏపీ వైపు కంపెనీలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వ విధానాలు, పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు... పరిశ్రమలు, సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే:
లోకేష్ సస్పెన్స్ . .
“2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక సంస్థ…తుపానులా రేపు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది. వారు ఎవరంటే… పూర్తి వివరాలు రేపు ఉదయం 9 గంటలకు.. వేచి ఉండండి!!” అంటూ నారా లోకేష్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు. #InvestInAP, #ChooseSpeedChooseAP, #BigUnveil వంటి హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశారు. ఈ ట్వీట్‌తో సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి.
ఆ సంస్థ ఏమిటి ?
లోకేష్ ట్వీట్ తో నెట్టింట ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొంతమంది అది లులు గ్రూప్ అయి ఉండొచ్చని అంటున్నారు. గతంలో ఈ సంస్థ కొన్ని ప్రాజెక్టులను నిలిపివేసింది. అయితే ప్రస్తుతం విశాఖ, విజయవాడల్లో లులు గ్రూప్ కోసం ప్రభుత్వం ఇప్పటికే భూములు కేటాయించింది. షాపింగ్ మాల్స్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో అది కాకపోవచ్చని కూడా అనుకుంటున్నారు . ఈలెక్కన చూస్తే మరొక కంపెనీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే పెట్టుబడులు పెట్టే సంస్థ ఎది? పెట్టబోయే పెట్టుబడుల పరిమాణం ఎంత? ఎక్కడ ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాబోతున్నాయి? అనే అంశాలపై ఆసక్తి మరింత పెరిగింది.
ఏపీ పెట్టుబడుల మ్యాప్‌లో తిరిగి వెలుగు..
ఐటీ రంగాన్ని తిరిగి వేగంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహాలు వల్ల 2019 తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు పునఃప్రారంభం కానున్న సూచనలు స్పష్టమవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఆ భారీ పెట్టుబడి ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు నారా లోకేష్ అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. ఏపీ పెట్టుబడుల గమనంలో ఇది మరో మైలురాయి కానుందని పరిశ్రమలతో పాటు ప్రజలు కూడా ఆశాభావంతో ఎదురు చూస్తున్నాయి.