భారత ప్రముఖ బాక్సర్ మేరీకోమ్? మరోసారి తన వైవాహిక బంధం గురించి మాట్లాడింది. ఇటీవల మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్పై ఆరోపణలు చేసే క్రమంలో ఆమె మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా తన తన మాజీ భర్తను ఉద్దేశించి మాత్రమే చేశానని, ఇంకెవరినీ బాధపెట్టాలని చేసింది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. 'చాలా ఏళ్ల పాటు మా వైవాహిక బంధం సజావుగానే సాగింది. అయితే నా భర్త తనను ఆర్థికంగా మోసగించడం వల్ల మా రిలేషన్ దెబ్బతింది. ఆ తర్వాతే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గతేడాది మాకు విడాకులు మంజూరైన తర్వాత నాపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా దాడి జరిగింది. అయినా నేను సంయమనం పాటించాను' 'రీసెంట్'గా ఒక టాక్ లో నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించండి. ముఖ్యంగా పురుష సమాజం. ఆ మాటలన్నీ నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన బాధ నుంచి వచ్చినవే. అయితే నా మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఏ ఆటకు కూడా వ్యతిరేకం కాదు. నేను క్రీడాకారులందర్నీ గౌరవిస్తా' అని మేరీకోమ్ క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మేరీకోమ్ తన మాజీ భర్తపై ఆరోపణలు చేసింది. అతడు 'గల్లీ ఫుట్బాల్' ఆటగాడంటూ విమర్శించింది. 'అనేక మందిలాగే అతడు కూడా ఓ సాధారణ గల్లీ ఫుట్ బాల్ ప్లేయర్. అంతమాత్రాన అతను బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి అవ్వలేడు. కెరీర్ లో అసలు సక్సెస్ అవ్వలేడు' అని మేరీకోమ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అయితే ఇందులో 'గల్లీ ఫుట్? బాల్' అనే వ్యాఖ్యల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఇది కాంట్రవర్సీ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై మేరీకోమ్ తాజాగా క్లారిటీ ఇస్తూ, క్షమాపణలు కోరింది. అయితే ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ ఓ ఫుట్బాల్ ఆటగాడు. అయితే మేరీకోమ్ కోసం తన కెరీర్ ను సైతం వదులుకున్నానని కరుంగ్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. దీనిపైనే మేరీకోమ్ విరుచుకుపడింది. అలా మాట్లాడింది. అయితే తామిద్దరు ఢిల్లీలో కలుసుకున్నప్పటికే కరుంగ్ తన కెరీర్ను వదిలేశారని మేరీకోమ్ పేర్కొంది. 2005లో మేరీకోమ్ కరుంగ్ ఆంఖోలర్ వివాహం జరిగింది. మణిపుర్ కు చెందిన మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్? లో అనేక ఘనతలు సాధించింది. అంతర్జాతీయ వేదికల్లో భారత్'కు ప్రాతినిధ్యం వహించిన మేరీకోమ్ ఎన్నో మరపురాని విజయాలు సాధించింది. 2012లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచింది. మహిళా బాక్సర్లలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా ఆరుసార్లు వరల్డ్' ఛాంపియన్గా నిలిచింది. 2016 నుంచి 2022 మధ్య రాజ్యసభకు కూడా మేరీకోమ్ ప్రాతినిధ్యం వహించింది. అయితే 41ఏళ్ల మేరీకోమ్ ప్రస్తుతం బిగ్ ఈవెంట్లలో ఆడకున్నా, రిటైర్మెంట్ తీసుకున్నట్లు మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. దేశం తరఫున ఇంకా పతకాలు సాధించాలనే ఆకలి ఉన్నట్లు గతంలో ఓ సందర్భంలో పేర్కొంది.