టాలీవుడ్లో లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. అందం, అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ వం-స హిట్లతో దూసుకుపోతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో మీనాక్షి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. ఆ ఎర్రటి డ్రెస్సులో మెరిసిపోతున్న ఆమెను చూసి ఫ్యాన్స్ 'రెడ్ డ్రెస్ అందాలతో ఉ క్కిరిబిక్కిరి చేస్తున్న మీనూ' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఆ విశేషాలు చూద్దాం.. మీనాక్షి ప్రయాణం నిజంగా ఒక స్ఫూర్తి అని చెప్పాలి. కేవలం గ్లామర్ ఫీల్డ్లోనే కాదు, చదువుకునే రోజుల్లోనే ఆమె స్టేట్ లెవల్ స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ ప్లేయర్ సత్తా చాటింది. ఆ క్రీడా స్ఫూర్తే ఆమెను అందాల పోటీల వైపు నడిపించింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా హర్యానాగా ఎంపికై, ఆ తర్వాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఇండియా తరపున రిప్రజెంట్ చేసి ఫస్ట్ రన్నరప్ నిలిచింది. ఈ విజయాలే ఆమెకు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించాయి. చూస్తుంటే ఈ భామ ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది కదా! సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫాలోవర్ల కోసం క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది మీనాక్షి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన రెడ్ డ్రెస్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ డ్రెస్సులో ఆమె కనిపిస్తున్న తీరు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే మతి పోగొట్టేలా ఉంది. ట్రెడిషనల్ లుక్ అయినా, ఇలాంటి హాట్ మోడ్రన్ లుక్లో అయినా మీనాక్షి స్టైల్ చాలా క్లాసీగా ఉంటుంది. అందుకే ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.