నూరి, సుహాస్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన తమిళ్ సినిమా 'మండాది'. ఎల్ఫ్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ వ్యాసర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రలను పోషించారు. మండాది సినిమా నేడు సెప్టెంబర్ 10న తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది. కళింగపట్నంను నట్టపులి(సుహాస్) రూల్ చేస్తూ ఉ ంటాడు. ఆ ఊళ్ళో సముద్రంలో జరిగే పడవపోటీలు ఎన్నో ఏళ్లుగా చాలా ఫేమస్. 20 ఏళ్లుగా నట్టపులి సునామి రైడర్స్ టీమ్ తో ఆ ఊరిని గెలిపిస్తూ ఉంటాడు. శ్రీను(రవీంద్ర విజయ్) కొడుకు మల్లేష్ (మిథున్ జై శంకర్) పడవల పోటీకి సంబంధించిన ఓ విషయంలో గొడవ జరిగి నట్టపులి కొడుకుపై దాడి చేస్తాడు. అది మిస్ అవ్వడంతో ఓ అమ్మాయి సాయంతో హైదరాబాద్ లో ఉన్న ముత్తు కాళీ (సూరి) దగ్గర తలదాచుకుని ఉంటాడు. ముత్తుకాళీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటూ ఓ స్విమ్మింగ్ పూల్ లో పనిచేస్తూ ఉంటాడు. కానీ సట్టపులి మనుషులు మల్లేష్ ని చంపడానికి అక్కడికి కూడా రావడంతో 20 ఏళ్లుగా ఊరికి వెళ్లని ముత్తుకాళీ మల్లేష్ ని తీసుకొని ఊరికి వస్తాడు. అక్కడ పెద్దలు సట్టపులికి ముత్తుకాళీ మధ్య రాజీ కుదర్చాలని ట్రై చేసినా అక్కడ పెద్ద గొడవ అవుతుంది. దాంతో కళింగపట్నం నుంచి రెండు టీమ్స్ పోటీ చేయాలి ఎవరు ఓడిపోతే వాళ్ళు ఆటని వదిలేయాలి అని నిర్ణయిస్తారు. పోటీకి కొన్ని రోజులు సమయం ఉండటంతో కొత్తవాళ్లకు ముత్తుకాళీ తన కళింగ వారియర్స్ టీమ్ గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సట్టపులి, అతని కొడుకు పోటీ ఎలాగైనా గెలవాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో ముత్తుకాళీ టీమ్ పడవ బోల్తా పడి పోటీలో ఉన్నవాళ్లు హాస్పిటల్ పాలవుతారు. దీంతో కళింగ వారియర్స్ కి పోటీల్లో ఎలా పాల్గొనాలో అర్ధం కాదు. మరోవైపు 20 ఏళ్ళ క్రితం ముత్తుకాళీ ఒకప్పుడు తన తల్లి ఏంజిల్ (మహిమా నంబియార్)ని ప్రేమించిన వ్యక్తి అని తెలిసి మల్లేష్ ముత్తుకాళీ పై కోపంగా ఉంటాడు. అసలు 20 ఏళ్ళ క్రితం ఆ ఊళ్ళో ఏం జరిగింది? బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే సట్టపులి ముత్తుకాళీ శత్రువులు ఎలా అయ్యారు? ఏంజిల్- ముత్తుకాళీ ప్రేమ ఎందుకు విఫలమైంది? పోటీలో గెలవడానికి నట్టపులి చేసే కుట్రలు ఏంటి? ఫైనల్ పోటీలో ముత్తుకాళీ టీమ్ గెలుస్తుందా? సముద్రంలో జరిగే సంఘటనలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.