రాజధాని రైతులకు లక్షన్నర రుణమాఫీ
కొత్తగా భూములిచ్చే రైతులకూ అవకాశం
అమరావతి గ్రామాల్లో భారీగా మౌలిక వసతులు
రూ.1437 కోట్ల పనులకు పాలనా అనుమతులు
సమాంతరంగా రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పైపులైన్లు
ఇప్పటికే రూ.904 కోట్లు కేటాయింపు..
అదనంగా మరో రూ.533 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఐఓసీఎల్ ఎంవోయూ అదనపు భూకేటాయింపునకు కొత్త విధానం
మార్కెట్ ధరకు రెండున్నర రెట్లు చెల్లించేలా నిర్ణయం
సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటరు రూ.596 కోట్లు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా స్వచ్చందంగా భూములిచ్చే రైతులకు ప్రభుత్వం తీపికబురుచెప్పింది. కొత్తగా ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే రైతులకు ఈ ఏడాది జనవరి 1వ తేదీకి ముందున్న రుణాల్లో లక్షన్నర రూపా యల వరకు మాఫీ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలోని వివిధ సంస్థలు అదనపు భూమి కోసం ప్రతిపాదనలు సమర్పిస్తే రెండున్నర రెట్లు అధిక మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. నచివాల యంలో గురువారం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఆర్థిక మంత్రి వయ్యావుల కేశన్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్ వీ విజయరామరాజు, ఏడీసీఎల్ చైర్పర్సన్ డీ లక్ష్మీపార్థసారథి, ఏజీజసీఎల్ ఎండీ అభిషేర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమా వేశం వివరాలను మంత్రి నారాయణ మీడియా కు వెల్లడించారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.1,437 కోట్లతో పెద్ద ఎత్తున మౌళిక వనతుల కల్పన చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.906 కోట్లతో పనులు చేపట్టామని, తాజాగా మరో రూ.538 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింద న్నారు. రాజధాని నగరానికి సమాంతరంగా గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు, అందర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి రైస్సు, లైటింగ్ తదితర మౌలిక వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. అమరావతిలో భూగర్భ మురుగునీటి పారుదల (యూజీడీ) వ్యవస్థ ఉన్నందున 29 గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తామ న్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.904 కోట్లు మంజూరు కాగా, తాజాగా మంజూరు చేసిన రూ.533 కోట్లతో కలిపి మొత్తం రూ.1,437 కోట్లతో 100 శాతం మౌలిక వసతులను పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. శాఖమూరులో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్ఎర్కు సంబంధించిన భవనాల నిర్మాణానికి రూ.596 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ మేరకు పనులు చేపట్టేం దుకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. 29 గ్రామాల్లో ఎల్పీఎస్ లేఅవుట్లలోని చిన్న రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మిం చాలని తొలుత నిర్ణయించినప్పటికీ, సీఆర్ఆర్ న్యూఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్ సంస్థలు అధ్యయనం చేశాయన్నారు. అమరావతి ప్రాంతంలోని నేల స్వభావం, భవిష్యత్‌లో పెరగ నున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్లకు బడు EXP బీటీ రోడ్డు నిర్మించాలని నిర్ణయించామన్నారు. అమరా వతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసేందుకు సీఆర్డీఎకు ఆథారిటీ అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 42 ఎకరాల్లో వివిధ ప్రాజెక్ట్ లను ప్రయివేట్ సంస్థలతో అభివృద్ధికి ఆమోదం. అమరావతిలో నివాసాలు, షావులు, కార్యాలయాలు తది తర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వం నిర్మించే కార్యాలయాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అభివృద్ధి జరిగేలా 42 ఎకరాల్లో వివిధ ప్రాజెక్ట్ లను దేవడుతున్నామ న్నారు.. ఇందుకోసం పిచ్చుకలపాలెంలో 7.9 ఎకరాలు, తుళ్లూరులో 5 ఎకరాలు, మండడంలో 12.38 ఎకరాలు, మరో ప్రాం తంలో 6 ఎకరాలు, కురగల్లులో 6 ఎకరాలు కలిపి మె-ఎత్తం 42 ఎకరాలను గుర్తించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
అదనపు భూ కేటాయింవునకు కొత్త విధానం
హోటళ్లు, పాఠశాలలు ఇతర ప్రాజెక్టులకు ఇప్పటికే భూములు కేటాయించిన ప్రాంతాల్లో పక్కనే కొంతమేర అదనంగా కోరుతున్న వారికోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అదనపు భూమిని కోరితే అమరావతిలోని ప్రస్తుత కనీన ధరపై కనీసం 250 శాతం ధరకు కేటాయించేందుకు ఆథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు. అమరావతిలో ప్రస్తుత కనీస ధర ఎకరాకురూ.4.1 కోట్లు కాగా, కనీసం ఎకరాకు రూ.10.25 కోట్లకు తగ్గకుండా అదనపు భూమిని కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
మంగళగిరికి అమరావతి నుంచి తాగునీరు
అమరావతి ల్ సిటీ నుంచి మంగళగిరి ంకార్పొరేష న్ కు తాగునీరు అందించేందుకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం మంగళగిరికి 30 ఎంఎల్డీ నీటి అవసరం ఉండగా రాబోయే 30 సంవత్స్రాలా జనాభా అవసరాలు దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో 80 ఎంఎల్టీ వరకు నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకునేలా, ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. అమరావతిలో నిర్మిస్తున్న స్టోరేజీల నుంచి మంగళగిరికి నీటిని అందిం చేందుకు, కిలోలీటర్‌కు రూ.10 చొప్పున ధర నిర్ణయించి సరఫరా చేయడానికి అధారిటీ అంగీకరించిందన్నారు.
గ్రీన్ ఎనర్జీకి ఐఓసీఎల్ ఎంఓయూ
అమరావతిలో గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఆర్డీఏకు అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు. మంత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమరావతిలో .. డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి 8.5 ఎకరాల భూమిని కేటాయించేందుడు ఆధారిటీ ఆమోదం తెలిపిందన్నారు. తాడికొండ, కంతేరులో ల్యాండ్ పూలింగ్. తాడికొండ, కంతేరు ప్రాంతాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ వెళ్తుండటంతో వాటి పరిధిలోని క్యాపిటల్ సిటీ వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకునేందుకు సీఆరీఏకు ఆధా రిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు.