మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. తమ కుమారుడు, కూతుర్లను శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "కల నెరవేరింది. నిజంగా ధన్యమైనది. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు" అని ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇందులో చెర్రీ పాసన దంపతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి, తమ పూజా మందిరంలో విగ్రహాల ముందు కూర్చుని పూజ చేస్తూ కనిపిస్తున్నారు. తమ కవల పిల్లలను ఒళ్లో కూర్చొని పెట్టుకుని పూజా కార్యక్రమంలో పాల్గొంటుండగా, వారి పెద్ద కుమార్తె క్లిన్ కార తన తల్లిదండ్రులు మధ్య కూర్చుని ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 'కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు అడుగుపెట్టాడు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన షేర్ చేసిన ఫొటోలో తమ ముగ్గురు చిన్నారుల ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ 'కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు అడుగుపెట్టాడు' అంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా కపుల్ కి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ కృష్ణాష్టమి స్పెషల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు 2023 జూన్ 20న క్లీంకారకు జన్మినిచ్చారు. ఈ ఏడాది జనవరి 31న వీరికి కవలలు జన్మించారు. బాబుకి శివరామ్, పాపకి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. ట్విన్స్ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లువెత్తాయి. కొణిదెల ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు వచ్చాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ఇటీవల బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో కనిపించారు. ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమాని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. చరణ్ ఈ మధ్యనే సర్జరీ చేయించుకోవడంతో, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.