ఏకాభిప్రాయంతో ముందుకు సాగుదాం
తీవ్రవాదం అంతమే మనందరి లక్ష్యం
యుద్ధభూమిలో పరిష్కారం లేదు.
ఎస్సీవో వేదికపై ప్రధాని సందేశం
మోడీ ప్రసంగ సమయంలో సదస్సులోనే ఉన్న పాక్ ప్రధాని
సదస్సు అనంతరం గ్రూప్ ఫోటో
అందులోనుంచి మోడీ ఫోటోను తొలగించిన పాక్ పీఎంవో
జిన్నింగ్, పుతిన్ తదితరులతో ప్రధాని మోడి కరచాలనాలు.. మాటామంతి
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ విధానాలకు తావు ఉండకూడదు అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా, ఏ కారణంతోనైనా సమర్థించడం లేదా ఎంపికచేసి ఖండించడం ప్రపంచ శాంతికి ప్రమాదకరమని పేర్కొన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) 26వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ఉగ్రవాదంపై సభ్య దేశాలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించా లంటే దాని నిధుల సమీకరణ, నియామకాలు, తీవ్రవాద భావజాల వ్యాప్తి, సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను అంత మొందించాలని పిలుపునిచ్చారు. సభ్య దేశాలన్నీ ఈ విషయం లో ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని కోరారు. అంతేకా కుండా, ప్రాంతీయశాంతి, భద్రతతో పాటు ఆర్థిక సహకారం, వాణిజ్య అనుసంధానం. మార్కెట్ కనెక్టివిటీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. అభివృద్ధి. భద్రత పరస్పరం అనుసంధానమై ఉన్నాయని అయన పేర్కొన్నారు. మోదీ ప్రసంగం చేస్తున్న సమయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెర్బాజ్ షరీఫ్ కూడా సభలో ఉందటం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా , ఉగ్రవాదా నికి ఆశ్రయం లేదా మద్దతు కల్పించే దేశాలపై పరోక్షంగా విమర్శలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తు న్నారు. యుద్ధభూ మిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించద ని, అన్ని యుద్ధాలు, ఘర్షణలకు చర్చలు, దౌత్యం ద్వారానే ముగింపు పలకా లని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యం లో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించు కుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం దేశాలన్నీ పరస్పర సహకారంతో ముందుకు రావాలని మోదీ అన్నారు. భద్రత, అభివృద్ధి, ఆర్థిక సహకారం ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని పేర్కొంటూ, విభేదాలను సంభాషణ ద్వారానే పరిష్కరించడం అంతర్జా తీయ సమాజం ముందున్న ప్రధాన బాధ్యత అని తెలిపారు.
ఫొటోలో మోడీని తొలగించిన పాక్ పీఎంఓ
షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు అనంతరం పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన గ్రూప్ ఫొటో వివాదానికి దారితీసింది. అధికారికంగా తీసిన ఫ్యామిలీ ఫొటోలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రపంచ నేతలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ పీఎంఓ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన చిత్రంలో మోదీ కనిపించకుండా క్రాప్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. దీంతో ఆ చర్యపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యర్థమయ్యా యి. ఈ ఫొటోలో షెబ్బాజ్ షరీఫ్‌ను మాత్రమే ప్రధానంగా కనిపించేలా ఎడిట్ చేశారని, బహుళపక్ష వేదిక మర్యాదలకు ఇది విరుద్ధమని పలువురు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం తో షెహ్బెజ్ షరీఫ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. వివాదం తీవ్రరూపం దాల్చిన తర్వాత పాకిస్థాన్ పీఎంఓ సవరించిన ఫొటోను విడుదల చేసినట్లునివేదికలు వెల్లడించాయి. కొత్త చిత్రంలో ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాధినేతలందరూ కనిపించేలా ఫొటోను మళ్లీ ప్రచురించింది.
పట్టించుకోని పుతిన్.. వెనకాలే షరీఫ్ పరుగు
శిఖరాగ్ర సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెర్బాజ్ షరీఫ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారిక గ్రూప్ ఫొటో సెషన్ ముగిసిన వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేదిక నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్లగా, షెర్బాజ్ షరీఫ్ ఆయనను కలిసేందుకు వేగంగా వెనకాలే పరుగులాంటి నడకతో వెళ్లిన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ ముందుకు నడుస్తుండగా, షరీఫ్ త్వరగా ఆయన వద్దకు చేరుకుని చేతిని అందించి పలకరించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఇద్దరు నేతలు కొద్ది సేపు మాట్లాదుకున్నారు. అయితే పుతిన్ స్వయంగా షరీఫ్ వద్దకు వెళ్లకుండా ముందుం స సాగడం, షరీఫ్ ఆయనను వెంబడిస్తూ వెళ్లడం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.
బిష్కెక్ నుంచి స్వదేశానికి ప్రధాని మోడీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళ వారం భారత్ బయల్దేరి వచ్చారు. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సులో సభ్య దేశాల అధినేతలతో కలిసి ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక సహకారం, కనెక్టివిటీ, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై మోదీ చర్చలు జరిపారు. సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.