చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
వైకాపా కుట్ర రాజకీయాలను తిప్పికొట్టడంపై దృష్టి
తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ
అంబటి-జోగి వ్యవహారంలో కులం కార్డుతో చిచ్చుకు యత్నం
వైసీపీ ట్రాప్ లో పడకూడదు.. అప్రమత్తంగా అడుగులేద్దాం
కీలక భేటీలో సీఎం -డిప్యూటీ సీఎం వ్యూహరచన
రెండున్నర గంటలపాటు ఏకాంత సమాలోచన
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు వారిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను వైకాపా రెచ్చగొడుతోందని.. ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు, ఆ పార్టీ ట్రాప్ లో పడకుండా ఉ ండేందుకు చర్యలు తీసుకోవాలని నేతలిద్దరూ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కిందిస్థాయిలో తెదేపా, జనసేన క్యాడర్ మధ్య చిచ్చుపెట్టేలా వైకాపా చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలపైనా చంద్రబాబు, పవన్ ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. బుధవారం ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నాక ఇద్దరి మధ్య సమావేశం మొదలైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలపై విపక్షం రెచ్చగొట్టే ప్రయాత్నాలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికలు, నియామక వదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న నేపథ్యంలో.. వారి మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం చర్యలు ఆదేశించడం, అలాగే ఈ అంశంపై సుప్రీం కోర్టుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్డీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గతంలో సీఎం మాట్లాడటం, విచారణకు పలువురు వెళ్లగా సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటై ఈ వ్యవహారంపై విచారించడం జరిగింది. నెయ్యి కల్తీ జరగడం వాస్తవమని తేలడంతో.. ఇందులో ఎవరు సూత్రధారులు అనేదానిపై కేబినెట్లో చర్చించడంతో పాటూ కల్తీకి ఆస్కారం ఇచ్చిన వారంతా బాధ్యులే అని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.