అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్ హత్య అత్యంత దారుణమని పేర్కొంటూ, ఈ ఘటన రాష్ట్రంలో న్యాయపాలన లేదనడానికి నిదర్శనమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని, ముఖ్యంగా పేదలు, దళితులు, బలహీన వర్గాలు రాజకీయ కక్ష సాధింపులకు బలవుతున్నారని జగన్ మండిపడ్డారు. ఈ దారుణ హత్యకు బాధ్యులైన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. మండా సల్మాన్ సోదరుడితో శుక్రవారం ఫోన్ ద్వారా మాట్లాడిన వైఎస్ జగన్, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సల్మాన్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే, దోషులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని వారికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ కుటుంబ సభ్యులు పిన్నెల్లి గ్రామంలో అధికార పార్టీ నేతల నుంచి కొనసాగుతున్న బెదిరింపులు, దాడుల వివరాలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే స్థానిక పోలీసుల ద్వారా వేధింపులు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.6] 0l స్పందించిన వైఎస్ జగన్, పార్టీ శ్రేణులు ఎలాంటి భయాందోళనలకు లోనవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి విషయంలో పార్ట్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల భద్రతను ధ్వంసం చేస్తున్న వారిని తప్పకుండా జవాబుదారీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.