ఎగువ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు
శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వరుగులు
జూరాల నుంచి 85 వేల క్యూసెక్కుల ప్రవాహం
ప్రాజెక్టులో 252.150 మీటర్లకు నీటిమట్టం
గోదావరికీ వరద పోటు.. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులు
రాజమహేంద్రవరం, నంబర్ వన్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి రెండు రోజులుగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల 85వేల క్యూసెక్కులు వచ్చాయి. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 269,750 మీటర్లు (885 అడుగులు) కాగా, మొత్తం నిల్వ సామర్థం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 252.150 మీటర్లుగా నమోదైంది. నీటి నిల్వ 46.8234 టీఎం సీలకు చేరుకుంది. జలాశయానికి ప్రస్తుతం 85,421 క్యూసెక్కుల ఇన్ నమోదవుతున్నది. ఇందులో జూరాల పవర్హౌస్ నుంచి 38,225 క్యూసెక్కులు, జూరాల స్పిల్వే ద్వారా 47,196 క్యూసెక్కుల నీరు జలాశయంకు చేరుతున్నాయి. ఆల్మట్టి, నారాయణ పూర్, జూరాల జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది.
నిండుకుండలా ఆల్మట్టి
ఆల్మట్టి జలాశయంలో నీటిమట్టం 519.19 మీటర్లకు చేరు కుంది. గత 10గంటలనగటు ఇన్లో 82,111 క్యూసెక్కులునమో దవ్వగా, అదే సమయంలో సగటు అవుట్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉంది. నారాయణపూర్ జలాశయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 491.45 మీటర్లుగా నమో దైంది. 29 గేట్లు ఎంపీసీఎల్ పవర్ హౌస్ ద్వారా మొత్తం 1,11,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 94,799 క్యూసెక్కుల నీరు ఇన్ వస్తుండగా, 12 స్పిల్వే గేట్ల ద్వారా 47,196 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
గోదావరికి వరద పోటు
నిన్నటి వరకు కనీస నీటి నిల్వలు, ఉదృతి లేక అల్లాడిన గోదారమ్మకు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలువిస్తారంగా కురుస్తుండటంతో.. ఆటు భద్రాచలం వద్ద, ఇటు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లంక గ్రామాలతో పాటు, రైతాంగాన్ని, వరద ప్రభావం ఎక్కువగా ఉండే ఏజెన్సీ అంత ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తోంది.
పెరుగుతున్న మట్టాలు
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారమవ్వడంతో గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం రాత్రికి వరద నీటి మట్టం 28.500 అడుగులకు చేరింది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 10.90 అడుగుల వద్దకు వరద నీటిమట్టం పెరిగింది. కాటన్ బ్యారేజ్కున్న 175 గేట్లలో 150 గేట్లను 0.3 మీటర్లు ఎత్తి, 2.02 లక్షల క్యూసెక్కుల జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. ఇక్కడ శుక్రవారం సాయంత్రానికి 11 అడుగులకు దాటి వరద నీటిమట్టం చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదేవిధంగా వరద ఉధృతి కొనసాగితే మరొక రెండు రోజుల్లో మొదటి ప్రమాద హెచ్చరికకు వరద చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 23 అడుగులకు చేరువలో వరద నీటిమట్టం ఉ ంది. ఇది 18 అడుగులు దాటితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు.