మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు కీలక పదవి
ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు కీలక పదవి దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కన్నబాబు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె త్వరలోనే దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.