మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురవ్వడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లండన్‌కు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయమే ముంబై ఎయిర్‌పోర్ట్‌ల లండన్ లట్ ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం ఇండోర్ వేదికగా మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విధించిన 338 పరుగుల లక్ష్యఛేధనలో భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా.. నితీష్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఈ పరాజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో న్యూజిలాండ్‌కు కోల్పోయింది. భారత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మరో ఐదు నెలల వరకు టీమిండియాకు వన్డే మ్యాచ్‌లు లేకపోవడంతో విరాట్ కోహ్లి లండన్‌కు వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లి తన ఫ్యామిలీతో లండన్‌లో లో కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌లకు సెలెబ్రిటీ హోదా ఉండకూడదని, మీడియాకు దూరంగా ఉంచాలనే కారణాలతో విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అక్కడి నుంచి తన ఫామ్‌ను కొనసాగిస్తూ పాత కోహ్లిలా చెలరేగుతున్నాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలతో పాటు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా న్యూజిలాండ్ ముగిసిన సిరీస్‌లో తొలి వన్డేలో 93 పరుగులు.. ఆఖరి మ్యాచ్ లో 124 పరుగులతో రాణించాడు. టీమిండియాకు మరో ఐదు నెలల పాటు వన్డే మ్యాచ్‌లు లేవు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 14న బర్మింగ్ హామ్ వేదికగా భారత్ తొలి వన్డే ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ఫోకస్ అంతా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ మీదే ఉంది. అలాగే జనవరి 21 నుంచి న్యూజిలాండ్ ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే మార్చి 26న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.