క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లి ఒక రన్ మెషీన్. గత దశాబ్ద కాలంగా అతను క్రీజులో ఉన్నాడంటే స్కోరు బోర్డు పరుగులెడుతుందని ఫ్యాన్‌కు నమ్మకం. అయితే నిన్నటి వరకు మనం చూసిన కోహ్లి వేరు, ఇప్పుడు చూస్తున్న కోహ్లి వేరు. సాధారణంగా విరాట్ క్రీజులోకి రాగానే కొంచెం సమయం తీసుకుని, సెటిల్ అయ్యాక గేర్ మారుస్తుంటాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడిన తీరు చూస్తే, కోహ్లి తన బ్యాటింగ్ ఫిలాసఫీని పూర్తిగా మార్చేసుకున్నాడని అర్థమవుతోంది. వడోదరలో జరిగిన మ్యాచ్? లో కోహ్లి ఫస్ట్ మూడు బంతుల్లోనే బౌండరీ బాదేశాడు. రాయ్‌పూర్, రాంచీ మ్యాచ్ కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. బౌలర్ ఎవరైనా సరే, క్రీజులోకి రాగానే తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని కోహ్లి ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఇన్నింగ్స్ ను హెల్డ్ చేసే యాంకర్ రోల్ పోషించిన విరాట్ ఇప్పుడు మాత్రం ఎదురుదాడితో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనవసరంగా వెయిట్ చేయకుండా మన స్ట్రెంగ్ మీద నమ్మకంతో కౌంటర్ ఎటాక్ చేయాలి అని కోహ్లి స్వయంగా తన కొత్త ఫార్ములాను బయటపెట్టాడు. విరాట్ కోహ్లి ఇప్పుడు ఏ రికార్డు కోసమో లేక తనని తాను నిరూపించుకోవడానికో ఆడటం లేదు. అన్నీ సాధించాక వచ్చే ఒక రకమైన స్వేచ్ఛ అతని బ్యాటింగ్ లో కనిపిస్తోంది. టెస్ట్, టీ20 రిటైర్మెంట్ తర్వాత వన్డేలలో మళ్ళీ స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి, తనలోని పాత ప్యాషన్'ను వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అక్టోబర్ నుంచి ఆడిన ఏడు మ్యాచుల్లో విరాట్ 106 స్ట్రైక్ రేట్‌తో 469 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ యావరేజ్ స్ట్రైక్ రేట్ (93.7) కంటే చాలా ఎక్కువ. రికార్డుల భారం దింపేసి ఆడుతుండటం వల్లే ఈ అద్భుతమైన ఫామ్ సాధ్యమవుతోంది. కోహ్లి ప్రస్తుత బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే కెప్టెన్ రోహిత్ శర్మ పద్ధతి గుర్తొస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్‌లలో రోహిత్ కూడా ఇదే తరహా అగ్రెసివ్ మైండ్ సెట్‌తో ఆడి సక్సెస్ అయ్యాడు. వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్‌కి మంచి ఆరంభం ఇవ్వడమే లక్ష్యంగా రోహిత్ బ్యాట్ ఝులిపించాడు. ఇప్పుడు విరాట్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. నెంబర్ 3 లో బ్యాటింగ్‌కి వచ్చే కోహ్లి, బౌలర్లు సెటిల్ అవ్వకముందే వారి లయను దెబ్బతీస్తూ టీమ్ ఇండియాను సేఫ్ జోన్లో కూర్చోబెడుతున్నాడు. విరాట్‌లో వచ్చిన ఈ మార్పు కేవలం బ్యాటింగ్ లోనే కాదు, తన ఆలోచనా విధానంలో కూడా కనిపిస్తోంది. "నేను ఇప్పుడు మైలురాళ్ల గురించి ఆలోచించడం లేదు, టీమ్ ని కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచడమే నా గోలు అని అతను ఓ క్లారిటీ ఇచ్చేశాడు. టెక్నిక్ లో మార్పులు కంటే మెంటల్‌గా అతను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడనేది అర్ధమవుతుంది. మెల్లగా ఆడుతూ వికెట్ ఇచ్చుకునే కంటే, తన బలాన్ని నమ్ముకుని అటాక్ చేయడం మంచిదని అతను భావిస్తున్నాడు. ఈ క్లారిటీయే అతన్ని క్రికెట్లో మళ్లీ తిరుగులేని వీరుడిగా మారుస్తోంది. వడోదర, రాయ్‌పుర్‌లలో కోహ్లి కొట్టిన బౌండరీలు కేవలం రన్స్ మాత్రమే కాదు, ప్రత్యర్థులకు అతను ఇస్తున్న హెచ్చరికలు. తన ఆటను మార్చుకుంటూ మోడరన్ క్రికెట్ డిమాండ్స్‌కి తగ్గట్టుగా అతను అప్డేట్ అవుతున్నాడు. వయసు పెరుగుతున్నా తన ఫిట్‌నెన్, ఆకలి ఏమాత్రం తగ్గలేదని విరాట్ నిరూపిస్తున్నాడు. కెరీర్ చివరి దశలో ఉన్నా కూడా ఇంతటి ఎనర్జీతో, భయం లేకుండా ఆడటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కింగ్ కోహ్లి ఇదే జోరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో టీమ్ ఇండియా మరిన్ని విజయాలను అందుకోవడం ఖాయం.