బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోతా తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము రెండోసారి తల్లితండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ కుమార్తె సారాయా చేతులతో పాటు, తమ చేతులను కలిపి ఉంచి, మధ్యలో ఓ జత చిన్నారి బూట్లను పట్టుకున్న అందమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వంచుకున్నారు. "మరోసారి గొప్ప బహుమతితో మేం ఆశీర్వదించబడ్డాం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి' అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. వీరి మొదటి గర్భం గురించి ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి ఫొటోనే పంచుకోవడం విశేషం. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. 2021 లో వచ్చిన 'షేర్షా' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో వడిన కియారా, సిద్ధార్డ్ 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికి 2025 జూలై 15న మొదటి సంతానంగా కుమార్తె సారాయా మల్హోతా జన్మించింది. మరోవైపు, ఈ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఫిల్మేకర్ కరణ్ జోహార్ "లవ్ లవ్ యూ" అని కామెంట్ చేయగా... సటులు కరీనా కపూర్ ఖాన్, అతియా శెట్టి, భూమి పెడ్నేకర్, డిజైనర్ మనీష్ మల్హోతా వంటి ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు.