సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అలా ప్రొఫెషనల్, వర్సనల్ కెరీర్లో ఏ లోటూ లేకుండా ఆడియన్స్న ఎంటర్టైన్ చేస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ). అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్‌తో ప్రేక్షకులకు అట్రాక్ట్ చేసే ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్ బిజీ భామల్లో ఒకరిగా మారిపోయింది. హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న కియారా.. ఒక పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూనే మ-రోవైపు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ', గేమ్ ఛేంజర్ సినిమాలతో పాటు మహేశ్ బాబుతో 'భరత్ అనే నేను'లో నటించి తెలుగు ఆడియన్స్న కియారా అద్వానీ దగ్గరైంది. అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్ ఆమె సొంతం. 1992, జులై 31న ముంబైలో కియారా జన్మించింది. ఈ బ్యూటీ అసలు పేరు అలియా అద్వానీ. తండ్రి జగదీప్ అద్వానీ బిజినెస్ మ్యాన్ కాగా, తల్లి జెనీవీవ్ జాఫ్రీ టీచర్. కియారా ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్లో స్కూలింగ్, తర్వాత జై హింద్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసింది. అయితే ఆమె బంధువులు సినీ ఇండస్ట్రీలో ఉండటంతో చిన్నప్పటి నుంచే బాలీవుడ్ గ్లోరీ, గ్లామరికి అట్రాక్ట్ అయ్యింది. కియారా 2014లో 'వగ్లీ' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016లో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్ 'ఎం.ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. లస్ట్ స్టోరీస్‌లో (2018) పోషించిన అన్ సాటిస్ఫైడ్ లైఫ్ పార్ట్నర్ క్యారెక్టర్‌తో తనలోని టాలెంట్‌ని బయటపెట్టింది. ఇక షాహిద్ కపూర్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'కబీర్ సింగ్' లో ప్రీతి క్యారెక్టర్ హైలెట్. గుడ్ న్యూజ్, షేర్షా, భూల్ భూలైయా 2, జగ్ జగ్ జీయో, సత్యప్రేమ్ కి కథ వంటి మరెన్నో చిత్రాలు చేసింది. డాన్ 3, టాక్సిక్ మూవీల్లోనూ నటిస్తోంది. కియారా కాంటెంపరరీ లైఫ్ స్టైల్ తన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆమె బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను లవ్ మ్యారేజ్ చేసుకుంది. షేర్షా సినిమా షూటింగ్ టైమ్‌లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు వీరిద్దరికి కుమార్తె వుట్టింది. ప్రస్తుతం కియారా ఫ్యామిలీ బాంద్రాలో నివసిస్తోంది. ఈమె తన పర్సనల్ లైఫ్ అప్డేట్స్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.