దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024ల ఉపసంహరణ
యూడీఏల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం
రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు
కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈవో పోస్టులు
అమరావతి క్యాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్‌కు రూ.1002.49 కోట్లు కేటాయింపు
వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
పలు కీలక నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర నచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో 34 అజెండా అంశాలపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించి.. మరింత పటిష్ఠ చట్టాల రూపకల్పనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ అనంతరం వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్టనవరణల ప్రతిపాదన, యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పాదచారుల భద్రత పాలసీ-2026, రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈవో పోస్టులు, అమరావతి క్యాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్‌కు రూ.1002.49 కోట్లు కేటాయింపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలను ఎల్అండ్ కి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులు, అమరావతి భూ కేటాయింపులపై జీవోఎం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 'అమరావతి ఐ' ప్రాజెక్టుకు రీ-టెండర్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదుల ముత్తూరులో 19.55 ఎకరాలు ఎపిఐఐసికి బదిలీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. తిమ్మసముద్రంలో 13.45 ఎకరాలు సియుడిఎకు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా యుడిఎ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందని, వాటి సంఖ్య 21 నుంచి 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కండలేరు నుంచి పరిశ్రమల క్లస్టర్‌కు నీటి సరఫరాకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. విజయవాడ ఆటోనగర్ కాలనీవాసులకు ఆ+ూ హక్కులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 400 హౌసింగ్ యూనిట్ల భూ సమస్యకు కేబినెట్లో పరిష్కారం చూపామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ భూ వివాదాల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అమరావతి 'ఐ' ప్రాజెక్టుకు సవరించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఎత్తైన అమరావతి ఐ నిర్మాణానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు 'ఆమ్నిబన్ చట్టం-2026' చట్టాన్ని తీసుకొచ్చామని, పెట్టుబడులకు అడ్డంకుల తొలగింపే ఆమ్నిబస్ చట్టం లక్ష్యమని పార్థసారథి స్పష్టం చేశారు. కుప్పం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు ప్రత్యేక పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. డి-ఫామ్ లేని సాగుదారులకు ఎకరాకు రూ.12.44 లక్షల పరిహారం అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణానికి ఆమోదం లభించిందని, ట్విన్ టవర్స్‌లో కార్పొరేట్, క్వాంటమ్ సంస్థలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైకోర్టు భవనం రీ-డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఏపీ పిపిపి పాలసీ-2026కు మంత్రిమండలి నుంచి ఆమోదం ముద్ర పడినట్లు చెప్పారు. ఖఖఖ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. భారీ పెట్టుబడుల ఆకర్షణేళి కొత్త పిపిపి పాలసీ లక్ష్యమని తెలిపారు. మోతడకలో 2,344 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్‌కు ఆమోద ముద్ర పడిందన్నారు. హైస్పీడ్ రైలు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూముల సమీకరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందని మంత్రి పార్ధసారథి పేర్కొన్నారు.