నువ్వా . . నేనా అంటూ సాగిన హైదరాబాద్ . . జూబిలీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు మరి కొద్దీ గంటల్లో తేలబోతున్నాయి. గట్టి బందోబస్తు మధ్య ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది . ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపీనాధ్ సతీమణి సునీతను పోటీలో పెట్టింది . సానుభూతి పవనాలు తనకు అనుకూలిస్తాయని ఆ పార్టీ వర్గాల అంచనా. ఇక ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను బరిలో దింపింది. స్థానికంగా పట్టు ఉన్న నాయకుడు కావడం..మజ్లీస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి . ఈ మధ్యాహ్నం 12 గంటలకల్లా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తేలిపోతుంది .
బీహార్ లో ఎవరొస్తారో . .
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాబోతున్నాయి. ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 38 జిల్లాల్లో నలభై ఆరు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ఇది పూర్తవుతుంది. దీని తర్వాత, EVMలు తెరుస్తారు. . ఆ తర్వాతే ట్రెండ్లు బయటపడతాయి. ఒక రౌండ్లో 14 EVMలు కౌంట్ చేస్తారు. దీని కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు . బార్బిఘా ఫలితం మొదట వచ్చే అవకాశం ఉంది .
మధ్యాహ్నం 12 గంటల సమయానికల్లా 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం దాదాపుగా ఖరారవుతుంది. వీరిలో నితీష్ కుమార్ ప్రభుత్వం నుండి 29 మంది మంత్రులు, అనంత్ సింగ్ సహా 15 మంది బలమైన వ్యక్తులు ఉన్నారు. ఈసారి బీహార్ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి, ఓటర్ల సంఖ్య 67.10%. ఇది రికార్డు స్థాయిలో ఓటింగ్, 2020 అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 10% ఎక్కువ.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా ఎన్డీయే కె విజయం దక్కే అవకాశాలున్నాయని అంచనా వేశాయి . అసలు ఫలితాల లెక్క కొద్దీ గంటల్లో తేలిపోనుంది .