'దసరా' విజయం తర్వాత కథానాయకుడు నాని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న బహుభాషా చిత్రం 'ది ప్యారడైజ్'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి కొత్త ఏడాది సందర్భంగా ఓ కొత్త లుక్ ను విడుదల చేశారు.'జడల్ జమానా' అంటూ వచ్చిన ఆ ప్రచార చిత్రంలో నాని యాక్షన్ లుక్ లో ఆకట్టుకునేలా కనిపించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమా మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.