టీమిండియా విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో సౌతాఫ్రికాతో ముంబై వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్ అదే జోరును కొనసాగించాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకొని వామప్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఒకే ఓవర్లో 29 పరుగులు చేశాడు. అన్రిచ్ నోకియా వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి అభిషేక్ సిక్స్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ໑໓ ລ້ ລ້ 6, 6, 4, 6 బాదాడు. 7 సిక్సులు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని ఈ మ్యాచ్ ద్వారా టీమ్ మేనేజ్మెంట్ హింట్ ఇచ్చింది.