న్యూజిలాండ్ జరిగిన వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆయన స్థానం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీ20, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టారు. అయితే, తాజా సిరీస్‌లో లో ఆయన ప్రదర్శన నిరాశపరచడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కోచ్ గంభీర్ ఎప్పుడూ కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మొగ్గు చూపుతుంటారు. 2027 ప్రపంచ కప్ నాటికి జట్టును యువతతో నింపాలని ఆయన భావిస్తున్నారు. రోహిత్ వయస్సు రీత్యా ఆయన ఫిట్నెస్, ఫామ్‌న గంభీర్ నిశితంగా గమనిస్తున్నారు. గిల్ సారథ్యంలో కొత్త తరం జట్టును నిర్మించే క్రమంలో సీనియర్లను పక్కన పెట్టే సాహసం గంభీర్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరం. న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లి తన ఫామ్‌ను నిలబెట్టుకోగా, రోహిత్ మాత్రం తడబడ్డారు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్ లో ఇద్దరూ రాణించి విమర్శలకు సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలమైతే, గంభీర్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉ ంది. 2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్‌లపై రోహిత్ శర్మకు ఉ న్న అనుభవం, ఆయన ఆడే 'ఫుల్ షాట్లు' జట్టుకు ప్లస్ పాయింట్ అవుతాయి. రోహిత్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌ లర్లకు ఉండే భయం అంతా ఇంతా కాదు. ఈ కోణంలో చూస్తే ఆయన అనుభవం జట్టుకు ఎంతో అవసరం.ఒకవేళ రోహిత్ శర్మ జట్టులో లేకపోతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నారు. యువ ఆటగాడైన జైస్వాల్ తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా జైస్వాల్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో కూడా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టులో లేకపోతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నారు. యువ ఆటగాడైన జైస్వాల్ తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా జైస్వాల్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో కూడా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.