ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి
ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం
వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు
ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు
విశాఖపట్నం : దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎస్ఆర్) బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతోపాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని.. ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్టార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధనా నౌకలు 9 ప్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌవదీ ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా వీక్షించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ.. తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్టార్డ్, మర్చంట్ నేవీ, వరిశోధన నౌకలు 7 ప్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.