నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారని సూర్య చెప్పడం.. కావాలంటే ఇంకో నాలుగు చిటికెలేస్తా. నువ్వు వడు చాలు' అంటూ మమిత క్యూట్‌గా బదులివ్వడం విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ టీజర్ కి ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. మనం గొప్ప అనుకున్న ప్రతిసారీ మనకన్నా గొప్పోడు ఒకడుంటాడని దేవుడు గుర్తు చేస్తాడు అంటున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడాయన నుంచి రానున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం 'విశ్వనాథ్ అండ్ నన్స్'. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మమితా బైజు కథానాయిక. ఈ చిత్రం జులైలో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. 'సంజయ్ విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టల్ కాంపిటేషన్స్‌లో గెలిచారు. కానీ, ఇప్పుడు వేరు. కంటి చూపుకి 20ల్లో ఉన్న ఫిట్నెస్ 40 దాటాక ఉండదు' అనే డైలాగ్ తో సూర్య పాత్రను పరిచయం చేస్తూ టీజర్ సాగిన తీరు ఆద్యంతం అలరించింది. దీంట్లో మ్యాడీగా మమితా బైజు చేసిన సందడి ఆకట్టుకుంది. ఆమె వయసులో తనకంటే 20ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకోవడం.. ఈ ఇద్దరి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది.