మిట్టల్ స్టీల్ ప్లాంటు చంద్రబాబు శంకుస్థాపన
హాజరైన కేంద్ర మంత్రి కుమారస్వామి
ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యం
దేశంలో పరిశ్రమలకు ఏపీ బెస్ట్ ప్లేస్
దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా అభివృద్ధి
అనకాపల్లి : ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట లో ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 5,465 ఎకరాల్లో 2 దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సంస్థ ప్రతినిధులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం పెట్టుబడి రూ.1,35,964 కోట్లు కాగా.. మొదటి దశలో 2,600 ఎకరాల్లో రూ.80 వేల కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు వేశారు. ఈ కర్మాగారంతో లక్ష మందికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆర్సెలార్ మిత్తల్ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్స్టాంట్ రెండు దశల్లో సాకారం కానుంది. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మించనున్నారు. క్యాప్టివ్ పోర్టు ద్వారా మరో 6 వేల ఉద్యోగాలు లభిస్తాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ రీజియన్ పరిశ్రమల హబ్‌గా మారనుంది.
ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడి ఓ గొప్ప మలుపు కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, సోమవారం ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్ ఈ స్టీల్ ప్లాంట్. ప్రధాని మోదీ సహకారంతోనే ప్లాంట్ ఏర్పాటు సాధ్యమైంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో మంత్రి లోకేశ్ కృషి ఎంతో ఉంది. అన్నివిధాలా సహకరిస్తున్న పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. ఇది స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కాదు.. స్టీల్ సిటీకి ఫౌండేషన్. అని అన్నారు. ఉ త్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్తచరిత్ర లిఖిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకంటే.. అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతోంద న్నారు. ఆర్సెలార్ మిత్తల్ పెట్టుబడిని గొప్ప మలుపుగా అభివర్ణించారు. భారత్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నక్కపల్లి లో ఏర్పాటు కాబోతోంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉ క్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కాబోతోంది. కేంద్రం సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్ సాధ్యమవుతోందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన చేస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీలను 20 నెలల్లో పూర్తి చేశాం. ఏ పని తలపెట్టినా బేషరతుగా మద్దతిస్తున్న పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేసిన లోకేశ్‌కు అభినందనలు. 5,465 ఎకరాల్లో ఆర్సెలార్ స్టీల్స్టాంట్ ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేస్తాం. ఇవాళ స్టీల్స్టాంట్కే కాదు.. స్టీల్ సిటీకి పునాది వేశాం. 2028 డిసెంబర్ నుంచి స్టీల్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో భూ సేకరణ చేశాం అని అన్నారు. దేశంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం. ఏపీలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవు. అద్భుత విజయాలకు పెట్టుబడిదారులు ఏపీని కేంద్రంగా
చేసుకోవాలి. ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. మూడేళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగ - అవకాశాలు కల్పిస్తాం. విశాఖను ప్రపంచస్థాయి నగరంగా చేస్తాం. విశాఖ, అమరావతి, తిరువతిని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. రేర్ ఎర్త్ మినరల్స్ హబ్ - విశాఖ తయారవుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నాం. కేంద్రం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతోంది. ప్లాంట్ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటాం. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. క్వాంటమ్ వ్యాలీకి కేరాట్గా అమరావతి మారబోతోంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు అధిక - ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆర్సెలార్
పెట్టుబడులు తమలో విశ్వాసం మరింత పెంచాయని అన్నారు. చంద్రబాబు వంటి దార్శనిక నేత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని అమిత్ షా కూడా చెప్పారని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని తెలిపారు. భూమిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్స్టాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 'ఆర్సెలార్ స్టీల్‌ఎ+-లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచాయి. పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికల్లో చెప్పాను. లక్ష్మీ మిత్తల్‌ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం. రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే పెట్టుబడులు వస్తున్నాయి. అదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ కూడా చెప్పారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లోనే ఆదిత్య మిట్టల్‌ను కోరామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 2024లో అధికారంలోకి రాగానే స్టీల్‌ఎ--లాంట్ కోసం ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానమన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో ప్రపంచ పటంలో అనకాపల్లి ఉంటుందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో లక్ష మందికి ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. పెట్టుబడిదారుల్లో సీఎం చంద్రబాబు విశ్వాసం నింపారని, ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమారస్వామి వేగంగా అనుమతులు ఇచ్చారని లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనే ఏపీ వ్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసించారు. నారా లోకేశ్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉక్కు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకున్నామని వెల్లడించారు. చంద్రబాబు శ్రద్ద, చొరవతో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వల్ల ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థికంగా మద్దతిచ్చాం. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాం అని అన్నారు.