సామాన్యులూ కంపెనీలు పెట్టాలి!
ఉద్యోగాలకే వారు పరిమితం కాకూడదు
స్టార్టప్‌ల ద్వారా వారిని ప్రోత్సహించాలి
దీని కోసం ఎకోసిస్టం రూపొందించాలి
40% ఇథనాల్ బ్లెండ్కు కేంద్రం అంగీకారం
ఇథనాల్ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం
సెమీకండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహిద్దాం
ఈవీ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీల ఉత్పత్తిపై దృష్టి అనుమతిచ్చాక ప్రాజెక్టులు మొదలెట్టాల్సిందే
పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరకు ఇళ్లు
ఎస్ఐపీబీలో అధికారులకు సీఎం ఆదేశం
రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
50 కంపెనీల ద్వారా 29,677 ఉద్యోగాలు
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
కిలో ధర 4 వరకు తగ్గించిన వ్యాపారులు
సీఎంతో ఆక్వా ఫీడ్ వ్యాపారుల భేటీ
ఆక్వా, టొబాకో, మామిడి రైతుల సమస్యలపై చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులు మాత్రమే స్థాపించగలరన్న అభిప్రాయం పోయేలా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. సామాన్యులు కూడా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని, దీని కోసం రాష్ట్రంలో తగిన పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను రూపొందించాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ. 30,515 కోట్లతో 50 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించారు. వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు రానున్నాయని కంపెనీలు తమ ప్రతిపాదనల్లో వెల్లడించాయి.సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "పేద, మధ్య తరగతి వర్గాలకు ఉద్యోగాలు కల్పించడమే కాకుం డా సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. స్టార్టప్ కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలి. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలి. ఆర్టీఐ హెచ్ పరిధి లో స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలి. ఈ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. అనుబంధంగా ఎకోసిస్టమ్ ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలి. పనులు ప్రారంభిం చని సంస్థలతో టచ్ లో ఉంటూ ఫాలోఅప్ చేయాలి.
ఆటోమేషన్ పారిశ్రామిక అనుమతులు
ఇథనాల్ తయారీ విషయంలో ఏపీ ముందడుగు వేయాలి. వాహనాల ఇంధనంలో 40 శాతం ఇథనాల్ బ్లెండ్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇథనాల్ తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. బయో ఫ్యూయల్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ టెక్నాలజీదే భవిష్యత్తు. లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి, ఈవీలకు ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించాలి. మైక్రో ఇరిగేషన్ రైతుల కోసం పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయాలి. అమరావతిలో ఏఐ, అల్గారిథమ్స్ క్వాం టమ్ అప్లికేషన్ల రూపకల్పన మొదలైంది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఎకోసిస్టమ్ కల్పించండి. ప్రాజెక్టుల అనుమతులు, భూ కేటాయింపులు వంటివాటిని పారిశ్రామికవేత్తలకు సులభంగా అందేలా చూడండి. ఆటోమోటివ్ పరిశ్రమలకు శ్రీసిటీ సహా అనంతపురం జిల్లా కూడా కీలకం. తిరుపతి శ్రీసిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ వస్తోంది. పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్ జెట్ విమాన తయారీ పరిశ్రమ వస్తోంది.
హోటల్ గదులు పెరగాలి
పర్యాటకులు రాష్ట్రంలో ఎక్కువ కాలం ఉండేలా హోటల్ రంగాన్ని విస్తృతంగా పెంచాలి. గదులు ఎక్కువ సంఖ్యలో నిర్మించాలి. మహీంద్రా క్లబ్ సంస్థ బీచ్ రిసార్ట్స్, పులికాట్ సరస్సు వద్ద కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. అరకు లాంటి ప్రాంతాల్లోనూ ఐటీడీఏ భాగస్వామ్యంతో మహీంద్రా ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంది.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలను గుర్తించాలి. తిరుపతి, అమరావతి, విశాఖల్లో బాబారామ్ దేవ్ యోగా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉంది. గండికోట, పోలవరం ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు వద్ద పెద్దఎత్తున హోటళ్లు రావాలి. సూర్యలంక బీచ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. పర్యాటకరంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలి. పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలి" అని సీఎం స్పష్టం చేశారు.