శ్రీలంకకు రూ.188కోట్ల నష్టం
శ్రీలంక క్రికెట్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. తొలిసారిగా నిర్వహించనున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీ-2027 ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి వెనక్కి తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను భారత్‌కు కేటాయిస్తున్నట్లు ఐసీసీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో శ్రీలంక సుమారు 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1885) ఆదాయాన్ని కోల్పోనుంది. శ్రీలంక క్రికెట్ (ఎన్ఎల్సే) పాలనా వ్యవహారాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ జోక్యమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఐసీసీ నిబంధనల ప్రకారం, క్రికెట్ బోర్డుకు ఎన్నికైన పాలకవర్గం ఉండాలి. కానీ, శ్రీలంకలో ప్రస్తుతం ప్రభుత్వంచే నియమించబడిన 'ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ' బోర్డు వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. దీనిపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆతిథ్య హక్కులను భారత్‌కు బదిలీ చేసింది. ఈ టోర్నమెంట్ 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, పడోదర వేదికలుగా జరగనుంది. 'శ్రీలంక డైలీ మిర్రర్' కథనం ప్రకారం.. రాజకీయ జోక్యాన్ని పరిష్కరించుకుని, బోర్డు ఎన్నికలు నిర్వహించకపోతే ఆతిథ్య హక్కులను కోల్పోతారని ఐసీసీ కొన్ని నెలల క్రితమే శ్రీలంక క్రికెట్ కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఈ విషయాన్ని మధ్యంతర కమిటీ.. అక్కడి క్రీడా మంత్రిత్వ శాఖ లేదా అధ్యక్షుడు అసుర కుమార దిననాయకే దృష్టికి తీసుకెల్లలేదని ఆ కథనం పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాల ద్వారా లభించే సుమారు 20 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని శ్రీలంక కోల్పోనుందని అంచనా, లంక క్రికెట్లో ప్రభుత్వ జోక్యం కారణంగా ఆ దేశం మెగా టోర్నీలను కోల్పోవడం ఇది రెండోసారి. గతేడాది ఇదే కారణంతో 2024 పురుషుల అండర్-19 ప్రపంచకప్‌ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు ఐసీసీ తరలించింది. మూడేళ్ల వ్యవధిలో రెండు కీలకమైన ఐసీసీ ఈవెంట్లను కోల్పోవడం శ్రీలంక క్రికెట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం లంక క్రికెట్ బోర్డులో రాజ్యాంగ సంస్కరణలు, కొత్త ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఇక, ఈ టోర్నమెంట్ మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, స్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. ఆరో స్థానం కోసం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆరు, ఏదు స్థానాల్లో ఉన్న వెస్టిండీస్, శ్రీలంక పోటీ పడనున్నాయి. ఆతిథ్య హక్కులు కోల్పోయినప్పటికీ, ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధిస్తే ఈ టోర్నీలో అదే అవకాశం శ్రీలంకకు ఉంటుంది.