స్వదేశంలో న్యూజిలాండతో జరుగుతున్న టి20 సిరీస్ లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలతో భారత్ జోరు మీదుండడంతో క్వీన్‌స్వీప్ పక్కా అని ఫ్యాన్స్ భావించారు. కానీ, బుధవారం విశాఖపట్టణంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 50 పరుగులు తేడాతో కివీస్ నెగ్గింది. 216 పరుగుల భారీ ఛేదనలో భారత్ 18.4 ఓవర్లలో 165 స్కోర్ కే పరిమితమైంది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఓ విషయంపై ఆందోళన నెలకొంది.పొట్టి ఫార్మాట్లో దూసుకుపోతున్నప్పటికీ, టీ20 వరల్డ్‌కప్ ముంగిట ఓ అంశం కలవరపెడుతోంది. టీ20ల్లో ఇప్పటికే భారత్ వరుసగా 11 సిరీస్‌లో విజయం సాధించి జోష్‌లో ఉంది. అయితే 2100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మాత్రం తడబాటుకు గురవుతోంది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ టీ20 చరిత్రలో టీమ్స్ఇండియా ఇప్పటిదాకా 210 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించలేదు. దీంతో ఇది వరల్డ్ కప్ ముంగిట భారత్‌కు బలహీనతే అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. భారత్ 020 క్రికెట్లో ఇప్పటిదాకా 118 సార్లు ఛేజ్ చేసింది. అందులో 80 మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇందులో ఒక్క మ్యాచ్ లో కూడా 2100 టార్గెట్ లేకపోవడం
గమనార్హం. మరో 34 టీ20ల్లో ఒటమి పాలైంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు. వాస్తవానికి టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో భారీ స్కోర్లు సాధించింది. ఈ సిరీస్ లోనూ మూడో మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే అందుకొని రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లో మాత్రం డీలా పడిపోయింది. సిరీస్‌లో జోష్‌మీదున్న భారత్ 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. త్వరత్వరగా వికెట్లు పడడం, ఒత్తిడి పెరిగిపోవడంతో ఓటమి చవిచూసింది.ఈ నేపథ్యంలో టీ20ల్లో 210 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే భారత్‌పై విజయం ఖాయం అనే పరిస్థితి తలెత్తింది. ఇది ప్రత్యర్థులకు అవకాశంగా మారుతోంది. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసి 201కంటే ఎక్కువ రన్స్ చేస్తే, టీమ్ ఇండియాను ఒత్తిడిలోకి నెట్టవచ్చు అని భావించే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా భారీ ఛేదనలో టీమ్ ఇండియా ఒత్తిడికి లోనవకుండా, ఎంతటి లక్ష్యాన్నైనా అందుకునేలాగా జట్టులో మార్పు రావాలని ఆశిస్తున్నారు. మరో 9 రోజుల్లో పొట్టి కప్పు టోర్నమెంట్ షురూ కానుంది. ఇది మెగా టోర్నమెంట్ కాబట్టి, ఇందులో మేటి జట్లతోనూ ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే, పట్టు వీడకుండా పోరాడాల్సిందే. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.
ఓటమితో గుణపాఠం నేర్చుకున్నాం...
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో 20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత గడ్డపై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నమోదైంది. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో వలు ప్రయోగాలకు దిగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో పేర్కొన్న ప్రకారం, జట్టు ఒక బ్యాట్స్‌మెన్‌ను తగ్గించుకుని, ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత 180-200 లక్ష్యాన్ని ఛేదించాలనే ఇలా చేశామని చెప్పాడు. మొదట బ్యాటింగ్‌లో అద్భుతాలు చేశాం. ఒకవేళ 180 లేదా 200 చేజ్ చేయాలనుకున్నప్పుడు రెండు లేదా మూడు వికెట్లు కోల్పోతే మిగిలిన బ్యాటర్లు ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆలోచించాం. ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉ న్న ఆటగాళ్ల అందరికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాం. ఇట్స్ ఏ గుడ్ చాలెంజ్. మళ్లీ అవకాశం వస్తే ఈసారి చేజ్ చేస్తాం. గుణపాఠం నేర్చుకున్నాం' అని సూర్య అన్నాడు. న్యూజిలాండ్ 215 పరుగులు చేయగా, భారత్ ఛేదనలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి అద్భుతమైన పోరాటం కనబరిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ తరపున టిమ్ సైఫర్ట్, డెవాన్ కాన్వే బలమైన భాగస్వామ్యం నెలకొల్పగా, మిచెల్ సాంట్నర్ అద్భుతమైన బౌలింగ్ (3/26)తో రాణించాడు. ఈ ఓటమి టీ20 ప్రపంచ కప్ ముందు జట్టుకు కొన్ని పాఠాలను నేర్పింది.