భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డివెవర్ మధ్య చర్చలు భారత్, బెల్జియం మధ్య పలు కీలక ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ భారత్, బెల్జియం ద్వైపాక్షిక సంబంధాలను మరింత వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ మధ్య గురువారం విస్తృత చర్చలు జరిగాయి. అందులో వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, క్లీన్ ఎనర్జీ, అధునాతన సాంకేతికత వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు వలు నిర్ణయాలు తీసుకున్నారు. చర్చల అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రపంచ పరిస్థితులు, భారత్ ఆర్థిక ప్రగతి, శాంతి-భద్రత వంటి అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం తీవ్ర మార్పులు, అనిశ్చితితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. ఆహారం, ఇంధనం, సరఫరా వ్యవస్థల నుంచి దాదాపు ప్రతి రంగంపైనా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పడుతోందని మోడీ పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తన వేగాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ వృద్ధి కొనసాగడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. దేశ ఆర్ధిక ప్రగతి ఇప్పుడు ప్రపంచానికి విశ్వాసాన్ని కలిగించడంతో పాటు కొత్త అవకాశాలకు దారితీస్తోందని మోడీ అన్నారు. ఇక ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై భారత్ వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ వివాదాలకు చర్చలు, దౌత్యం, న్యాయపాలన ఆధారంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్రెయిన్ లేదా పశ్చియాసియా అయినా ఘర్షణలు త్వరగా ముగిసి శాంతి నెలకొనేందుకు చేపట్టే ప్రయత్నాలకు భారత్", బెల్జియం మద్దతు ఇస్తాయని తెలిపారు. ఉగ్రవాదంపై కూడా ఇరుదేశాలు ఒకే వైఖరిని కలిగి ఉన్నాయని మోదీ చెప్పర్ల. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా నిర్మూలించేందుకు కలిసి పనిచేయడం రెండు దేశాల ఉమ్మడి బాధ్యతగా పేర్కొన్నారు. భారత్', బెల్జియం మధఅయ భవిష్యత్ సహకారంలో క్లీన్ ఎనర్జీ, సురక్షితమైన సరఫరా వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది సుస్థిర ఇంధన రంగంలో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుందని మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలక ఖనిజాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంపైనా ఇరుదేశాలు దృష్టి సారించాయి. ఖనిజాల ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌లో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉ పయోగపడుతుందని భావిస్తున్నారు. అధునాతన సాంకేతిక రంగంలోనూ భారత్, బెల్జియం మధ్య సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో బెల్జియం సాంకేతిక నైపుణ్యం, భారత్ వద్ద ఉన్న విస్తృత స్థాయి ఉ త్పత్తి సామర్థ్యం ఒకదానికొకటి అనుకూలంగా ఉ ంటాయని పేర్కొన్నారు.
రక్షణ రంగంలోనూ భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు ఇరుదేశాలు ఆసక్తి చూపాయి. ఆధునిక రక్షణ సాంకేతికత పరికరాల తయారీ, పరిశ్రమల మధ్య భాగస్వామ్యానికి అవకాశాలను అన్వేషించున్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల సంబంధాలకు కొత్త అవకాశాలను తెరుస్తుందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు. భారత్, యూరప్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల్లో రెండుగా ఉన్నాయని మోడీ గుర్తుచేశారు. రెండు పక్షాల మధ్య పెరుగుతున్న సహకారం ప్రపంచ స్థిరత్వం, ఆర్ధిక వృద్ధి, ఉమ్మడి అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.