ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలమెంతో మొత్తం ప్రపంచానికి నిరూపించింది. ఇప్పుడు త్వరలో ప్రపంచం మన వైమానిక దళాలలో మరొక కొత్త కోణం చూడబోతోంది. భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ స్టెల్త్ డ్రోన్‌ను తయారు చేస్తోంది. ఇది శత్రువు హై-రెస్ రాడార్ - ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ నుండి తప్పించుకోగలదు. సెకన్ల కంటే తక్కువ సమయంలో దాడి చేయగలదు.
'రామ' కవచం ఈ డ్రోన్ యొక్క అతిపెద్ద లక్షణం.
'రామా' అనేది రాడార్ అలాగే ఇన్ఫ్రారెడ్ గుర్తింపును 97% తగ్గించే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక కవరింగ్ ఏజెంట్. ప్రస్తుతం, అమెరికా, చైనా, రష్యా మాత్రమే రాడార్ల నుండి దాక్కునే స్టెల్త్ డ్రోన్లను కలిగి ఉన్నాయి.
ఈ డ్రోన్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సహాయంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ వీరా డైనమిక్స్, బిన్‌ఫోర్డ్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేస్తున్నాయి.
రాడార్ అబ్జార్ప్షన్ అండ్ మల్టీస్పెక్ట్రల్ అడాప్టివ్ దీనినే షార్ట్ ఫామ్ గా రామా అని పిలుస్తున్నారు. ఇది శత్రువుల రాడార్ అలాగే ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ నుండి పూర్తిగా దాచగల ఒక ప్రత్యేక పదార్థం అని కంపెనీ సీఈఓ సాయి తేజ అన్నారు. 2025 చివరి నాటికి, రామాతో ఉన్న డ్రోన్‌ను నేవీకి అప్పగించే అవకాశం ఉంది.
రామా అంటే ఏమిటి?
ఇది నానోటెక్ ఆధారిత స్టెల్త్ పూత, ఇది రాడార్ అలాగే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలో కనిపించనీయకుండా చేస్తుంది. దీనిని డ్రోన్‌పై పెయింట్ లేదా కవర్ రూపంలో ఏర్పాటు చేస్తారు. ఇది కార్బన్ పదార్థాల మిశ్రమం, ఇది రాడార్ తరంగాలను గ్రహిస్తుంది. శక్తిని వేడిగా బయటకు వదులుతుంది. ఇది థర్మల్ ఇండెక్స్ లను సెకనుకు 1.5 ° సెల్సియస్ తగ్గిస్తుంది. దీనిని వీరా డైనమిక్స్ అభివృద్ధి చేసింది.
యుద్ధ రంగంలో దీని ప్రభావం ఎంత?
ఏదైనా యుద్ధం జరిగినపుడు శత్రువు మొదట రాడార్‌తో మన డ్రోన్‌ను గుర్తించి, ఆపై ఇన్‌ఫ్రారెడ్‌తో లక్ష్యంగా చేసుకుని షూట్ చేస్తాడు. ఈ రామా కవర్ ఉంటె మన డ్రోన్ ఈ రెండింటి నుండి తప్పించుకుంటుంది
సైన్యానికి ప్రయోజనం ఏమిటి?
సాధారణంగా శత్రువుపై దాడికి 100 డ్రోన్లను పంపినప్పుడు, 25–30 మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటాయి. అయితే రామా టెక్నాలజీతో సిద్ధం అయినా కొత్త డ్రోన్లు 80-85 లక్ష్యాలను ఛేదిస్తాయి. డ్రోన్ బరువు 100 కిలోలు. ఇది 50 కిలోల పేలోడ్‌ను మోయగలదు.
పృథ్వీ-2, అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం..
ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి భారతదేశం గురువారం రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పృథ్వీ-2 , అగ్ని-1 ను విజయవంతంగా పరీక్షించింది.
పృథ్వీ-2 పూర్తిగా స్వదేశీ తయారీ, ఉపరితలం నుండి ఉపరితలం వరకు ప్రయోగించే క్షిపణి, ఇది 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. 1,000 టన్నుల పేలోడ్‌ను మోయగలదు.
అదేవిధంగా, 700 నుండి 900 కి.మీ పరిధి కలిగిన అగ్ని-1 క్షిపణి 1 టన్ను పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది 2007 నుండి భారత సైన్యం వద్ద ఉంది.