అండర్-19 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో అఫ్గానిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115; 104 బంతుల్లో) సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (68; 33 బంతుల్లో) అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) బాధ్యతాయుతంగా అది అర్థసెంచరీ పూర్తి చేశాడు. చివర్లో విహాన్ మల్హోత్రా (38 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్'ను పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 810 పరుగులతో భారీ స్కోర్' చేసింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా (101 నాటౌట్) అద్భుత శతకాలతో భారత బౌ లర్లను ఆడుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఉస్మాన్ సాదత్ (39), ఖలీద్ అహ్మద్దాయ్ (31) కూడా బాగానే ఆడారు. అఫ్గాన్ చివరి 10 ఓవర్లలో ఏకంగా 111 పరుగులు చేయడం గమనార్హం. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేశ్ దేవేంద్రన్ చెరో రెండు వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు ఉస్మాన్ నదత్ (39), బలిద్ అహ్మద్ జాయ్(31) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడిని దీపేష్ దేవండ్రన్ విడదీసాడు. బలిదా్ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ ఉస్మాన్‌తో కలిసి ఫైనల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన ఉస్మాన్‌ను కానిక్ చౌహన్ ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి ఉజైరుల్లా నియాజై రాగా.. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను చెడుగుడు ఆడారు. ఈ క్రమంలో 55 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫైనల్.. అనంతరం మరింత దూకుడుగా ఆది మరో 31 బంతుల వ్యవధిలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కాస్త నిదానంగా ఆడిన ఉడైరుల్లా నియాడై 63 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 148 వరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని దీపేష్ విదదీసాడు. అద్భుతమైన బంతితో సెంచరీ హీరో ఫైసల్‌ను క్లీన్ బౌ ల్డ్ చేశాడు. అజిజుల్లా మియకిల్ తో కలిసి నియాజై చెలరేగాడు. భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడి 85 బంతుల్లో శతకం సాధించాడు. హాఫ్ సెంచరీ నుంచి శతకం పూర్తి చేసుకోవడానికి అతనికి 22 బంతులే పట్టింది. ఈ విధ్వంసంతోనే అఫ్గాన్ 310 వరుగుల భారీ స్కోర్ చేసింది. దీపేష్, కానిక్ చౌహన్ మినహా భారత బౌలర్లంతా విఫలమయ్యారు. పరుగులను కట్టడి చేయకపోగా.. వికెట్లు కూడా తీయలేకపోయారు. భారత్ ఫైనల్ చేరాలంటే 310 పరుగుల ఈ లక్ష్యాన్ని చేదించాలి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై భారత టాపార్డర్ చెలరేగితే ఇది సాధ్యమవుతుంది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే అత్యధికం. ఇప్పటివరకు జరిగిన 16 మెగా టోర్నీల్లో భారత్ ఫైనల్క చేరడం ఇది 10వ సారి కావడం విశేషం. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్, ఇప్పుడు ఆరో ట్రోఫీపై కన్నేసింది. ఫిబ్రవరి 6న జరగనున్న ఈ ప్రపంచ కప్? తుది పోరులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.