రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించాలి
గత ప్రభుత్వంలో జరిగిన అపచారాలు పునరావృతం కారాదు
శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణను వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి: దేవాలయాల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో, జరగవని, అవచారాలు రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి పవన్ కల్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు అన్నారు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉ న్నాయి. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు.. నాకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానన్నారు.. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉ ందన్నారు పవన్.. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నారు. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని.. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు పవన్ కల్యాణ్.. శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటుతామని.. శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రూ.10 కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్డు నిర్మించామన్నారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు.. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ మార్గానికి ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం అన్నారు.. శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ ద్వారా ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షణ చేసిన ఫుణ్యఫలం దక్కాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నారు. సంక్షేమ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని ఆధ్యాత్మిక ఆంధప్రదేశ్ తీర్చిదిద్దుతామని.. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. 15,016 ఆలయాలకు పాలకమండళ్లను వేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే సుమారు వెయ్యి ఆలయాలకు పాలమండళ్లను నియమించామని చెప్పుకొచ్చారు. మిగిలిన వాటిపైనా దృష్టి సారిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.