భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 8:54 గంటలకు బాహుబలి రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనుంది. ఈ రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు కాగా, బరువు సుమారు 6400 టన్నులు. ఇది ఇస్రో రూపొందించిన అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనాలలో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ రాకెట్ ద్వారా మొత్తం 15 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రెండు ముఖ్యమైన శాటిలైట్లు ఉండగా, మిగతావి ప్రయోగాత్మక ఉపగ్రహాలుగా సమాచారం. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని సాధించినట్లే.
శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రయోగం ద్వారా దేశ రక్షణ, సమాచార, వాతావరణ పరిశీలన రంగాలకు మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, చివరి దశ పరీక్షలు కూడా విజయవంతంగా ముగిశాయని ఇస్రో అధికారులు వెల్లడించారు.