ఆకాశం నుంచి నిరంతర నిఘా
ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన జీఎస్ఎల్వీ ఎఫ్ 17
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లి, 2,367 కిలోల బరువున్న ఈఓఎస్--05 భూ పరిశీలన ఉ పగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో విజయాల ఖాతాలో మరో మైలురాయి నమోదైంది.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లి, 2,367 కిలోల బరువున్న ఈఓఎస్--05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో విజయాల ఖాతాలో మరో మైలురాయి నమోదైంది. ఈఓఎస్--05 ప్రత్యేకత ఏమిటంటే.. భూస్థిర కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించే సామర్థ్యంతో రూపొందించిన భారత తొలి భూ పరిశీలన ఉపగ్రహంగా ఇది నిలిచింది. కక్ష్యను క్రమంగా పెంచిన అనంతరం సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో పనిచేయనుంది. ఇప్పటివరకు భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ ఎత్తు కక్ష్యల్లో భూమి చుట్టూ తిరుగుతూ వివిధ ప్రాంతాలను విడతలవారీగా పరిశీలించేవి. అయితే ఈఓఎస్--05 విస్తారమైన భూభాగాన్ని నిరంతరం గమనించేలా ప్రత్యేకంగా రూపొందించారు. భూమిపై చోటుచేసుకుంటున్న మార్పులను మరింత వేగంగా గుర్తించి, అవసరమైన సమాచారాన్ని దేశానికి అందించడమే ఈ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. వ్యవసాయ రంగంలో పంటల పరిస్థితిని పర్యవేక్షించడం, వర్షాభావం, అధిక వర్షాల ప్రభావాన్ని అంచనా వేయడం, వరదలు, ఇది తుపాన్ల సమయంలో ప్రభావిత ప్రాంతాలను త్వరగా గుర్తించడం వంటి సేవలకు ఈఓఎన్--05 చిత్రాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. అలాగే అటవీ ప్రాంతాలు, నీటి వనరుల్లో చోటుచేసుకునే మార్పులను నిరంతరం గమనించేందుకు ఈ ఉపగ్రహం దోహదపడనుంది. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించడంతోపాటు, దేశ వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని కూడా అందించే సామర్థ్యం దీనికి ఉంది. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల ప్రయోగ బరువు కలిగిన జీఎస్ఎల్వీ ఎఫ్17 మూడు దశల్లో ప్రయాణించింది. ఇందులో క్రయోజెనిక్ దశ అత్యంత కీలకమైనది. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడంతో ఇస్రో శాస్త్రవేత్తల సాంకేతిక సామర్థ్యానికి మరోసారి నిదర్శనం లభించింది. జీఎస్ఎల్వీ ద్వారా భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లో 2,367 కిలోల ఈఓఎస్--05 అత్యంత భారీ ఉపగ్రహంగా నిలిచింది. 2021లో ఈఓఎస్--03 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్పీ ఎఫ్10 ప్రయోగం క్రయోజెనిక్ పైదశలో ఏర్పడిన లోపం కారణంగా విఫలమైంది. ఆ నేపథ్యంలో తాజా ప్రయోగ విజయం ఇస్రోకు మరింత ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 27 గంటల కౌంట్ డౌన్ అనంతరం స్వల్ప వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 2026లో ఇస్రో చేపట్టిన తొలి విజయవంతమైన ప్రయోగంగా జీఎస్ఎల్బీ ఎఫ్17 నిలిచింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జరిగిన ప్రయోగాల పరంపరలో ఇది 106వ ప్రయోగం కాగా, జీఎస్ఎల్వీకి 19వ ప్రయోగం కావడం విశేషం. ప్రయోగం అనంతరం ఈఓఎస్--05 సౌర ఫలకాలు విజయవంతంగా విచ్చుకున్నాయి. పగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. భూమిని నిరంతరం గమనించే కొత్త కంటిని ఆకాశంలోకి పంపిన ఇస్రో, దేశ భద్రత నుంచి వ్యవసాయం, విపత్తు నిర్వహణ వరకు అనేక రంగాలకు కీలక సమాచారాన్ని అందించే మరో శక్తిమంతమైన సాధనాన్ని భారత్కు అందించింది.